బంగారం ధరల్లో తాజా పరిణామాలు: మరో అవకాశం?
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ వారం ప్రారంభంలోనే కొంత శాంతించాయి. ఈ ఉదయం ట్రేడింగ్ లో ఈ రెండింటి లోహాల ధరల్లో స్వల్ప క్షీణత నమోదైంది. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ ఉద్రిక్తతల వల్ల సురక్షితమైన పెట్టుబడిగా వీటికి ఉన్న అంతర్జాతీయ డిమాండ్ మాత్రం అలాగే బలంగా కొనసాగుతోంది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ 5 నాటి కాంట్రాక్ట్స్ సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ ధర సుమారు 0.5 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 1,53,870 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో డిసెంబర్ 4 నాటి వెండి కాంట్రాక్టులు కూడా 0.39 శాతం నష్టంతో కిలోకు రూ. 2,40,663 వద్ద ట్రేడ్ అయ్యాయి. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 160 రూపాయల తగ్గుదల నమోదైంది. 22 క్యారెట్లల్లో రూ. 150, 18 క్యారెట్లల్లో రూ. 120 మేర తగ్గాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలు, ఇన్వెస్టర్లలో లాభాల స్వీకరణ వంటి అంశాల కారణంగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,470 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్లు రూ. 1,41,598 కాగా.. వెండి కిలో రూ. 2,40,770 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,670, 22 క్యారెట్లు- రూ. 1,41,781 గా నమోదయ్యాయి. ఇక్కడ వెండి 2,41,090 రూపాయలు పలుకుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,54,350, 22 క్యారెట్లు, 1,41,488 గా, వెండి రూ. 2,40,580 గా రికార్డయింది. ముంబైలో ఇవే రేట్లు రూ. 1,54,250, రూ. 1,41,396, రూ. 2,40,200 గా రికార్డయ్యాయి. మధ్యప్రాచ్యంలో సుమారు ఏడు నెలలుగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఈ కమోడిటీ మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తోన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,568, 22 క్యారెట్లు - రూ. 14,270, 18 క్యారెట్లు - రూ. 12,040
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,568, 22 క్యారెట్లు- రూ. 14,270, 18 క్యారెట్లు - రూ. 11,676
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,568, 22 క్యారెట్లు- రూ. 14,270, 18 క్యారెట్లు - రూ. 11,676
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,568, 22 క్యారెట్లు- రూ. 14,270, 18 క్యారెట్లు - రూ. 11,676
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,568, 22 క్యారెట్లు- రూ. 14,270, 18 క్యారెట్లు - రూ. 11,676
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,568, 22 క్యారెట్లు- రూ. 14,270, 18 క్యారెట్లు - రూ. 11,676













Click it and Unblock the Notifications
