WTC Points Table: పింక్ బాల్ దెబ్బకు టీమిండియా ఢమాల్-టాప్ లో ఆస్ట్రేలియా..!
అడిలైడ్ లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. డేనైట్ ఫార్మాట్ లో జరిగిన ఈ పింక్ బాల్ టెస్టు ఫలితంపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ రాణించిన ఆస్ట్రేలియా ఈ టెస్టును 10 వికెట్ల తేడాతో గెల్చుకుంది. అదే సమయంలో బ్యాటింగ్ లో విఫలమైన భారత్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ముఖ్యంగా స్టార్ బ్యాట్స్ మెన్ వైఫల్యం భారత్ కు శాపంగా మారింది.
అడిలైడ్ టెస్టులో భారత్ ఓటమితో ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది. అంతటితో అయిపోలేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్లపైనా ఈ ప్రభావం గట్టిగా పడింది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో గెలిచి ఆస్ట్రేలియాను డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో వెనక్కి నెట్టిన భారత్.. ఇప్పుడు రెండో మ్యాచ్ లో ఓటమితో మరోసారి రెండో స్ధానానికి పడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా తిరిగి తన నంబర్ వన్ పొజిషన్ దక్కించుకుంది.

మూడు రోజుల్లోనే ముగిసిన పింక్ బాల్ టెస్ట్‌లో భారత్‌పై మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో మళ్లీ నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా 60.71 పీసీటీ శాతం సాధించి నంబర్ వన్ ర్యాంకుకు చేరింది. మరోవైపు అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో డే-నైట్ టెస్టులో ఓటమితో భారత్ ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం 57.29 పాయింట్ల శాతంతో మూడో స్ధానంలో నిలిచింది.












Click it and Unblock the Notifications