మా బతుకులు కెన్యా,ఉగాండాలతోనే: పాక్ క్రికెటర్ ఏడ్చేసినంత పని!
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ అద్భుత విజయం సాధించి విశ్వవిజేతగా నిలవడంతో పాక్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. టీమిండియా విజయాన్ని చూసి పాక్ ఆటగాళ్లు తమ అక్కసును వెళ్లగక్కడంతో పాటు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత్ ట్రోఫీని ముద్దాడటాన్ని చూసి పాక్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ తన దేశ క్రికెట్ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఒక టీవీ షోలో అహ్మద్ షెహజాద్ మాట్లాడుతూ.. భారత్ సాధిస్తున్న ప్రగతిని, పాక్ వెనుకబాటుతనాన్ని పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత్ వద్ద టాలెంట్‌తో పాటు వ్యవస్థ ఉంది..
పాకిస్థాన్ మీడియాలో జరిగిన చర్చా కార్యక్రమంలో అహ్మద్ షెహజాద్ మాట్లాడుతూ.. "పాకిస్థాన్‌లో టాలెంట్‌కు కొదవ లేదు, కానీ మన దగ్గర సరైన వ్యవస్థ లేదు. ఇండియాలో టాలెంట్ తో పాటు ఓ పటిష్టమైన వ్యవస్థ ఉంది. అందుకే అక్కడ నిరంతరం మ్యాచ్ విన్నర్లు తయారవుతున్నారు. సంజూ శాంసన్ ఎవరో చూడండి.. గతంలో అవకాశాల కోసం ఎంతో ఎదురుచూశాడు, ఇప్పుడు ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అయ్యాడు. ఇషాన్ కిషన్ అప్పుడప్పుడు ఆడినా క్రమశిక్షణతో డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించి ఇక్కడికి వచ్చి మెరిశాడు" అని కొనియాడాడు.

250 పరుగుల లక్ష్యం.. టీమిండియా కసి!
భారత్ ఆడుతున్న క్రికెట్ ప్రమాణాల గురించి ప్రస్తావిస్తూ.. "భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 250 పరుగులు చేయాలనే లక్ష్యంతో ఆడుతుంది. అదే మనమైతే 180 పరుగులు చేసి, దానిని కాపాడుకోమని బౌలర్లకు చెబుతాం. కానీ భారత్ అలా కాదు.. మ్యాచ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లోనే ముగించాలని చూస్తుంది. ఫైనల్లో అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేసి ఒత్తిడిని ఎలా చిత్తు చేయాలో చూపించాడు. న్యూజిలాండ్ పుంజుకోకపోయి ఉంటే భారత్ స్కోరు 275 దాటేది" అని షెహజాద్ విశ్లేషించాడు.
పాకిస్థాన్‌కు ప్రత్యేక ర్యాంకింగ్స్ ఇవ్వండి: సెటైర్లు
తన దేశ జట్టు తీరును ఎండగడుతూ షెహజాద్ ఘాటుగా స్పందించాడు. "మనం జింబాబ్వే, కెన్యా, ఉగాండా వంటి జట్లను పిలిచి వారిపై గెలిచి పెద్ద ఘనత సాధించినట్లు సంబరాలు చేసుకుంటాం. కానీ భారత్ అలా కాదు.. పెద్ద జట్లతో ఆడుతుంది, పెద్ద సిరీస్‌లు గెలుస్తుంది. ఐసీసీ మనకు ప్రత్యేక ర్యాంకింగ్స్ ఇవ్వాలి. అందులో కెన్యా, ఉగాండా, జింబాబ్వే వంటి జట్లే ఉండాలి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లతో మనల్ని పోల్చవద్దు" అని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. అహ్మద్ షెహజాద్ చేసిన ఈ కామెంట్స్ పాక్ క్రికెట్ బోర్డులో కదలిక తెస్తాయో లేదో చూడాలి, కానీ టీమిండియా సాధించిన ఈ విజయం మాత్రం పొరుగు దేశం లోని క్రికెటర్లలో అసూయతో కూడిన గౌరవాన్ని నింపింది అనడంలో సందేహం లేదు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications