Champions Trophy 2025 winner: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతపై AIల అంచనాలివే..!

భారత్-న్యూజీలాండ్ మధ్య రేపు దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అలాగే ఈ మ్యాచ్ లో భారత్ క్లియర్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతోంది. అయినా ఐసీసీ టోర్నీల్లో ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ ల్లో కివీస్ కు ఉన్న రికార్డు నేపథ్యంలో క్రికెట్ విశ్లేషకులు అంత సులువుగా భారత్ ను విజేతగా తేల్చేసేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏఐ ప్లాట్ ఫామ్స్ ఛాట్ జీపీటీ, గూగుల్ జెమిని, డీప్ సీక్ తమ అంచనాల్ని వెల్లడించాయి.

భారత్-కివీస్ మధ్య జరిగే ఫైనల్ పై ప్రపంచవ్యాప్తంగా పలువురు క్రికెటర్లు, మాజీలు, క్రీడా విశ్లేషకులు, బాబాలు, బెట్టింగ్ సంస్ధళు కూడా తమ జోస్యాల్ని వెల్లడిస్తున్నాయి. ఇదే క్రమంలో ఏఐ ప్లాట్ ఫామ్స్ అయిన ఛాట్ జీపీటీ, గూగుల్ జెమిని, డీప్ సీక్ తమ అంచనాల్ని ప్రకటించాయి. ఇందులో ముందుగా గూగుల్ జెమినీ ప్రకారం భారత్-కివీస్ మధ్య విజేతను తేల్చడం అంత సులువు కాదు, అయితే భారత్ కు ఎడ్జ్ మాత్రం ఇవ్వొచ్చని తెలిపింది.

AI platforms mixed predictions on India-new Zealand champions trophy final 2025 winner

మరో ఏఐ సంస్థ ఛాట్ జీపీటీ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ను టీమిండియా ఎగరేసుకుపోతుందని అంచనా వేసింది. విరాట్ కొహ్లీ, శ్రేయర్ అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్ల ప్రదర్శన చూస్తే రోహిత్ సేనకు టైటిల్ గెలిచే అవకాశం ఉందని ఛాట్ జీపీటీ తెలిపింది. అలాగే మరో ఏఐ సంస్థ డీప్ సీక్ మాత్రం భారత్-కివీస్ మధ్య విజేతను నిర్ణయించడం సులువు కాదని తేల్చేసింది. ఎందుకంటే ఇరుజట్లూ బలంగా కనిపిస్తున్నాయని తెలిపింది. భారత్ అనుభవం వారికి ఎడ్జ్ ఇస్తున్నా, కివీస్ పోరాట పటిమను కూడా తక్కువ అంచనా వేయలేమని డీప్ సేక్ వెల్లడించింది.

Take a Poll

మరో ఏఐ ప్లాట్ ఫారం మైక్రోసాఫ్ట్ కో పైలట్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ పై భారత్ కు క్లియర్ ఎడ్జ్ ఉందని తెలిపింది. భారత్ కు టైటిల్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించింది. టీమిండియా బలమైన లైనప్ తో పాటు స్థిరమైన ఆటతీరు కూడా ఇందుకు కారణంగా తెలిపింది. మరో సంస్థ ఆంథ్రోపిక్ కు చెంది క్లాడ్ కూడా భారత్ కే విజయావకాశాలు ఉన్నాయని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+