ఈ ఇద్దరిలో ఒకరు అవుట్?
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం సన్నద్ధమౌతోంది భారత క్రికెట్ జట్టు. ఇటీవలే ఈ టోర్నమెంట్ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టు ఇది. టీ 20 వరల్డ్ కప్ తో పాటు న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లోనూ ఇదే జట్టు ఆడుతుంది. ఈ జట్టులో వైస్ కేప్టెన్ శుభ్ మన్ గిల్ కు చోటు దక్కలేదు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఎంపిక అయ్యాడు. వైస్ కేప్టెన్ గా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ నియమితుడయ్యాడు.
భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నమెంట్‌లో 20 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 55 మ్యాచ్‌లు ఆడతాయి. భారత పర్యటన కోసం న్యూజిలాండ్ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది కూడా. టీ20లకు మిచెల్ శాంట్నర్, వన్డేలకు మైఖేల్ బ్రేస్‌వెల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. బ్లాక్ క్యాప్స్ జనవరిలో భారత్‌తో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లలో ఆడనుంది. గాయం నుంచి కోలుకున్న కైల్ జెమీసన్ రెండు ఫార్మాట్లలోనూ చేరాడు. మార్క్ చాప్‌మన్, మాట్ హెన్రీ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. కేన్ విలియమ్సన్, జాకబ్ డఫ్ఫీ, రచిన్ రవీంద్ర గాయాల కారణంగా దూరం అయ్యారు.

టీ20 వరల్డ్ కప్ ముందు జరగబోయే ఈ సిరీస్ భారత్ కు ప్రతిష్ఠాత్మకం. వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో కొన్ని భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగుస్తుంది. ఇదివరకు ఆయన పదవీ కాలాన్ని 2026 జూన్ వరకు పొడిగించింది బీసీసీఐ. 2023 జులైలో అగార్కర్.. చీఫ్ సెలెక్టర్ గా పగ్గాలు అందుకున్నాడు. ఆయన నేతృత్వంలో భారత జట్టు 2023 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది.
అలాగే 2024లో ఐసీసీ టీ20 ప్రపంచకప్, 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకుంది. ఈ విజయాలే ఆయన పదవీకాలాన్ని పొడిగించడానికి బీసీసీఐకి ప్రధాన కారణాలు. దీని తర్వాత పొడిగింపు ఉండకపోవచ్చని తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చితే తప్ప అజిగ్ అగార్కర్ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించకపోవచ్చు. కొత్త చీఫ్ సెలెక్టర్ ను ఎంపిక చేయడానికే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పరిస్థితే వస్తే టీమిండియా మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్ లేదా ప్రజ్ఞాన్ ఓఝా చీఫ్ సెలెక్టర్ గా ఎంపికకావచ్చని తెలుస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications