Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముంబై ఇండియన్స్ కేప్టెన్సీ ఇచ్చేత్తారా?: నీతా అంబానీ- రోహిత్‌ మధ్య తొలగిన విభేదాలు

Anant Ambani Radhika Merchant wedding: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పండగ వాతావరణ నెలకొంది. రెండో కుమారుడు అనంత్ అంబానీ సంగీత్ వేడుకలు గ్రాండ్‌గా సాగుతున్నాయి. దక్షిణ ముంబైలోని కంబన్ హిల్ ప్రాంతంలో ఆయన నివాసం అంటాలియా, నీతా అంబానీ ముఖేష్ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్.. దీనికి వేదిక అయ్యాయి.

అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌ ఈ నెల 12వ తేదీన పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. దీనికోసం ప్రీ-వెడ్డింగ్, సంగీత్ సెలబ్రేషన్స్ ఏర్పాటయ్యాయి. గుజరాత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక. భరత నాట్య కళాకారిణి కూడా. గత ఏడాదే ఆమె అరంగేట్రం చేశారు.

Anant Ambani- Radhika Merchant these Indian Cricketers were present

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లి చేసుకోనున్నట్లు 2019లోనే ఈ రెండు కుటుంబాలు ప్రకటించాయి. గత ఏడాది నిశ్చితార్థ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఇక పెళ్లి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వివాహానికి దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఇప్పటికే ముంబైకి వచ్చారు.

శుక్రవారం రాత్రి కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన వేడుకల్లో పలువురు బాలీవుడ్ హీరోలు, క్రికెటర్లు పాల్గొన్నారు. సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, ఆలియా భట్, హార్దిక్ పాండ్యా, బోనీ కపూర్, జాన్వీ కపూర్.. దీనికి హాజరయ్యారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్, కోడలు శ్లోకా, కూతురు ఇషా అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమళ్- ఆటపాటలతో కట్టిపడేశారు. బాలీవుడ్ హిట్ సాంగ్స్‌‌కు డాన్స్ చేశారు. అద్దిరిపోయే స్టెప్పులేశారు.

Anant Ambani- Radhika Merchant these Indian Cricketers were present

టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కేప్టెన్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. తాజాగా ఈ సంగీత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ వారిని గెస్ట్‌లకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సమయంలో నీతా భావోద్వేగానికి గురయ్యారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

17 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వస్తోన్న కలను రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా సాకారం చేశారని ప్రశంసించారు. టీ20 వరల్డ్ కప్ గెలవాలంటూ 140 మంది కోట్ల మంది భారతీయులు కోరుకుంటోన్నారని, వారి ఆశలు ఫలించాయని పేర్కొన్నారు. టీమిండియా క్రికెటర్లను రియల్ హీరోగా అభివర్ణించారు.

ఐపీఎల్‌లో నీతా అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ తరఫున ఈ ముగ్గురూ ఆడుతున్న విషయం తెలిసిందే. గతంలో గుజరాత్ టైటాన్స్‌ కేప్టెన్‌గా పని చేసిన హార్దిక్ పాండ్యాను అదేపనిగా పిలిపించుకున్నారు నీతా. అప్పటివరకు కేప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను తొలగించి ముంబై ఇండియన్స్ కేప్టెన్సీ పగ్గాలను పాండ్యా అప్పగించారు.

అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపింది. నీతా అంబానీతో విభేదాల వల్లే రోహిత్ శర్మను కేప్టెన్సీ హోదా నుంచి తొలగించారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ సంగీత్ సెలబ్రేషన్స్‌లో రోహిత్ పట్ల నీతా చూపిన ఆప్యాయతను చూస్తోంటే ఆ విభేదాలు తొలగిపోయినట్టేననిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+