ఎవడ్రా మనల్ని ఆపేది..!!

కొలంబో: శ్రీలంక వేదికగా కొనసాగుతున్న ఆసియా కప్ 2023 టోర్నమెంట్.. సూపర్ 4లో భాగంగా భారత్ తన మలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. 41 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఆసియా కప్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 17వ తేదీన ఫైనల్స్ ఆడనుంది. అంతకంటే ముందు 15వ తేదీన చివరి సూపర్ 4లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ విజేత ఫైనల్స్‌లో భారత్‌ను ఢీకొడుతుంది. ఎల్లుండి కొలంబోలో ఈ రెండు జట్లు ఢీకొట్టనున్నాయి. ఫైనల్ బెర్త్ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. శుభారంభం చేసినప్పటికీ- దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. వరుసబెట్టి వికెట్లను కోల్పోయింది. పాకిస్తాన్‌పై రెచ్చిపోయిన రోహిత్ శర్మ.. ఇక్కడా అంతే ధాటిగా ఆడాడు. 48 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేసి, వెల్లలెగె బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శుభ్ మన్ గిల్- 19 పరుగులకే అదే వెల్లలెగె బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

Asia Cup 2023

తొలి వికెట్ భాగస్వామ్యానికి 80 పరుగులు జోడించిన తరువాత టీమిండియా ఎక్కడే గానీ కోలుకోలేదు. భారీ భాగస్వామ్యం ఏర్పడలేదు. విరాట్ కోహ్లీ-3, ఇషాన్ కిషన్-33, కేఎల్ రాహుల్-39, హార్దిక్ పాండ్యా-5, రవీంద్ర జడేజా-4, జస్‌ప్రీత్ బుమ్రా- 5, కుల్‌దీప్ యాదవ్-0, అక్షర్ పటేల్-26 పరుగులు చేశారు.

టీమిండియాను దునిత్ వెల్లలగె, చరిత్ అసలంక కట్టడి చేశారు. వెల్లలగె-5, అసలంక-4 వికెట్లు పడగొట్టారు. మహీష్ తీక్షణకు ఒక వికెట్ పడింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వికెట్లను వెల్లలెగె తీసుకన్నాడు. ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్‌ను అసలంక పెవిలియన్ దారి పట్టించాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక.. టీమిండియా బౌలర్లను ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది. టీమిండియా తరహాలోనే వరుసబెట్టి వికెట్లను కోల్పోయింది. 41.3 ఓవర్లల్లో 172 పరుగులకు ఆలౌట్ అయింది. దునిత్ వెల్లలగె 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు శ్రీలంక ఇన్నింగ్‌లో. మిడిలార్డర్‌లో ధనంజయ డిసిల్వా-41 చేశాడు.

Asia Cup 2023

పాథుమ్ నిశ్శంక- 6, దిముత్ కరుణరత్నె-2, కుశాల్ మెండిస్- 15, సదీర సమరవిక్రమ- 17, చరిత్ అసలంక-22, డాసన్ శనక- 9, మహీష్ తీక్షణ-2, కసున్ రజిత- 1, మతీషా పతిరణ-0 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో కూడా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ రెచ్చిపోయాడు. 9.3 ఓవర్లల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, రవీంద్ర జడేజా రెండు చొప్పున, సిరాజ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ నేలకూల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+