Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆసియా కప్ ఫైనల్స్‌కు ముందు బిగ్ షాక్- స్టార్ బౌలర్ అవుట్..?

కొలంబో: ఆసియా కప్ 2023 టోర్నమెంట్ సూపర్ 4లో సంచలనం చోటు చేసుకుంది. ఫైనల్స్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. శ్రీలంక చేతిలో మట్టికరిచింది. ఫైనల్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఈ నెల 17వ తేదీన జరిగే ఫైనల్‌లో శ్రీలంక జట్టు.. భారత్‌ను ఢీకొట్టడానికి ఉవ్విళ్లూరుతోంది.

కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 42 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ దుమ్ము లేపాడు. 73 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్- 52, మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్- 47 పరుగులతో అతనికి అండగా నిలిచారు.

 Asia cup 2023, IND vs SL: Injury blow for Sri Lanka as Maheesh Theekshana strained his hamstring

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బ్యాటర్లు అద్భుతంగా పోరాడారు. పాకిస్తాన్ బౌలింగ్‌కు ఎదురునిలిచారు. మూడో వికెట్ భాగస్వామ్యానికి ఏకంగా వంద పరుగులను జోడించడంతోనే లంకేయులు సగం విజయం సాధించినట్టయింది. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద ఉన్నప్పుడే తొలి వికెట్ కోల్పోయింది గానీ.. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు ఇన్నింగ్‌ను నిలబెట్టారు.

వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ 91 పరుగులతో చెలరేగాడు. 87 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఓపెనర్ పాథుమ్ నిశ్శంక- 29, కుశాల్ పెరీరా- 17 రాణించకపోయినా మిడిలార్డర్ బ్యాటర్లు వెన్నెముకగా నిలిచారు. సదీర సమరవిక్రమ- 48, చరిత్ అసలంక- 49 నాటౌట్.. జట్టును విజయ తీరాలకు చేర్చారు.

ఈ విజయంతో 11వ సారి ఆసియాకప్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది శ్రీలంక. డూ ఆర్ డై మ్యాచ్‌లో తనకంటే బలమైన పాకిస్తాన్‌ను ఓడించి సత్తా నిరూపించుకుంది. ఆదివారం ఇదే కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లో టీమిండియాను ఢీ కొడుతుంది. ఇప్పటివరకు లంక ఆరుసార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది.

ఈ మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ స్పిన్ బౌలర్ మహీష్ తీక్షణ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో బౌండరీ వైపు దూసుకెళ్తోన్న బంతిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు కింద పడ్డాడు. అప్పటికప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాడు గానీ చివరి వరకూ నిలవలేకపోయాడు.

35వ ఓవర్‌ను సంధించడానికి వచ్చినప్పుడు తడబడుతూ కనిపించాడు. శ్రీలంక ఇన్నింగ్ 39వ ఓవర్ ప్రారంభం సమయంలో అతను గ్రౌండ్‌ను వీడాడు. సపోర్టింగ్ అతణ్ని చేతులపై తీసుకెళ్లారు. ఆ తరువాత తీక్షణ మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టలేదు. నేడు అతణికి స్కానింగ్ తీయనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.

స్కానింగ్ రిపోర్టులు అందిన తరువాతే.. తీక్షణను ఫైనల్స్ ఆడే తుదిజట్టులో ఎంపిక చేయాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఎల్లుండే ఫైనల్. ఎక్కువ సమయం లేదు. ఈ లోపే తీక్షణ రికవరీ అయ్యే అవకాశాలు అంతంత మాత్రమే కనిపిస్తోన్న నేపథ్యంలో అతను టీమిండియాపై ఆడటం అనుమానమే.

శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్స్ టీమ్‌లో కీ ప్లేయర్ మహీష్ తీక్షణ. ఇప్పటివరకు 15 మ్యాచ్‌లను ఆడిన అతను 31 వికెట్లను పడగొట్టాడు. ఈ సంవత్సరంలో అతనే లీడ్ వికెట్ టేకర్. ఆసియా కప్‌ 2023 సూపర్ 4లో పాకిస్తాన్‌పై మ్యాచ్‌లోనూ ఓ వికెట్ పడగొట్టాడు. మహ్మద్ నవాజ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+