విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్.. ! తొలిసారి డిమోషన్..!

కొత్త ఏడాదిలో దిగ్గజ క్రికెటర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ షాకిచ్చింది. దశాబ్దానికి పైగా భారత జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించిన రోకో జోడీని, వారి ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తూ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పి కేవలం వన్డేలకు పరిమితం అవుతున్న వీరిద్దరికీ తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఈ షాక్ తగిలింది.

రోహిత్, కొహ్లీకి బీసీసీఐ షాక్

2025-26 సీజన్ కోసం బీసీసీఐ తాజాగా సెంట్రల్ కాంట్రాక్టులను ఖరారు చేసింది. ఇందులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రధానంగా రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరికీ బోర్డు డిమోషన్ ఇచ్చింది. టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడుతున్న క్రికెటర్లతో కూడిన ఎలైట్ ఏ ప్లస్ కేటగిరీని బీసీసీఐ ఈసారి రద్దు చేస్తోంది. దీని స్ధానంలో మూడు స్ధాయిల ఫార్మాట్ కు మారుతోంది. ఇందులోనే రోహిత్, కొహ్లీకి షాకిచ్చారు.

BCCI Central Contracts SHOCK virat Kohli Rohit sharma Demoted in New List

గ్రూప్ ఏ నుంచి బీకి డిమోషన్

తాజా సెంట్రల్ కాంట్రాక్టుల్లో గ్రూప్ ఏ నుంచి దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గ్రూప్ బీకి మార్చేశారు. గత కొంతకాలంగా వీరిద్దరి ఆటతీరులో వచ్చిన మార్పులు, బోర్డు ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ టీ20లు, టెస్ట్ క్రికెట్‌కు దూరమయ్యారు. కేవలం వన్డేల్లోనే ఆడుతున్నారు. అందుకే మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఏ గ్రూపులో ఉన్న వీరు కాస్తా బీ గ్రూపుకు మారాల్సి వచ్చింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో కేవలం ముగ్గురు క్రికెటర్లే ఉన్నారు. ఇందులో టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్ మన్ గిల్, పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మాత్రమే ఉన్నారు.

BCCI Central Contracts SHOCK virat Kohli Rohit sharma Demoted in New List

ఎవరెవరు ఏ గ్రూపులో ?

ఇక గ్రూప్ -బీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కేఏల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. అలాగే గ్రూప్ సీలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+