IPL 2025: ఐపీఎల్ టోర్నీపై బీసీసీఐ సంచలన నిర్ణయం..!

భారత్-పాక్ మధ్య ఉద్రికతల ప్రభావం ఇండియన్ క్రికెట్ లీగ్ 2025పై పడింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ 2025టోర్నీపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. నిన్న ధర్మశాలలో ఢిల్లీ, పంజాబ్ మధ్య మ్యాచ్ ను అర్ధాంతరంగా నిలిపేసిన బీసీసీఐ.. ఇవాళ టోర్నీని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. దీంతో పాకిిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు దిగింది. నిన్న జమ్మూ, జైసల్మేర్ తో పాటు పలు చోట్ల డ్రోన్లతో దాడులకు పాకిస్తాన్ విఫలయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ధర్మశాలలో జరుగుతున్న ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ ను అర్దాంతరంగా నిలిపేసారు. పాకిస్తాన్ డ్రోన్ దాడులకు దొరక్కుండా ఉండేందుకు విద్యుత్ సరఫరాను ఫూర్తిగా నిలిపేశారు. దీంతో కాసేపు ప్రేక్షకులకు ఏమీ అర్ధం కాలేదు. తర్వాత మ్యాచ్ రద్దయిందని చెప్పి అందరినీ స్టేడియం నుంచి పంపేశారు.

bcci-indefinitely-postponed-ipl-2025-due-to-indo-pak-tensions

నిన్నటి ధర్మశాల మ్యాచ్ ఘటన తర్వాత బీసీసీఐ ఐపీఎల్ 2025 టోర్నీని వాయిదా వేయబోమని ప్రకటించింది. తమకు సురక్షితమైన ఎన్నో స్టేడియాలు ఉన్నాయని, వాటికి మ్యాచ్ లను తరలిస్తామని తెలిపింది. అయితే ఉగ్రదాడుల నేపథ్యంలో ఉత్తర భారతంలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతుండటంతో బీసీసీఐ కూడా చేసేది లేక టోర్నీని వారం రోజు పాటు వాయిదా వేేసేసింది. ఉద్రిక్తతలు తగ్గాక తిరిగి దీన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు నిన్న ధర్మశాల మ్యాచ్ రద్దు తర్వాత మెజార్టీ క్రికెటర్లు టోర్నీలో ఆడేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది విదేశీ క్రికెటర్లు ఇలా విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. వీరు లేకుండా టోర్నీ ముందుకు సాగడం కష్టం. దీంతో బీసీసీఐ ఐపీఎల్ టోర్నీ నిర్వహణపై ఇవాళ సమావేశమై వారం రోజుల పాటు టోర్నీని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+