T20 world cup: ఆసీస్‌తో ఉత్కంఠ పోరు నేడే..ఓడితే ఇంటికే
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా సోమవారం కీలక మ్యాచ్ జరగనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సమరానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెయింట్ లూసియా వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. భారత్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిస్తే గ్రూప్ టాపర్‌గా నిలవడమే కాకుండా.. సెమీఫైనల్లోకి ప్రవేశిస్తుంది. రోహిత్‌సేనకు సెమీస్‌లో స్థానం ఇప్పటికే దాదాపుగా ఖాయమైనప్పటికీ.. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గితే నేరుగా ముందంజ వేస్తుంది. మరోవైపు అఫ్గానిస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి కారణంగా.. సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం కంగారూలకు తప్పనిసరైంది.
అయితే ఈ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉంది. సెయింట్ లూసియాలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఇవాళ కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరుణుడు శాంతించినా మధ్యలో ఆటంకాలు తప్పవని సమాచారం. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే భారత్‌కు ఎలాంటి నష్టం ఉండదు. 5 పాయింట్లతో టీమిండియా సెమీస్‌కు చేరుకుంటుంది. ఆసీస్ భవితవ్యం మాత్రం బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌పై ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ భారత్‌తో మ్యాచ్ రద్దైతే ఆసీస్ ఖాతాలో 3 పాయింట్లు చేరతాయి. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో కూడా ప్రస్తుతం 2 పాయింట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు గెలిస్తే వారి ఖాతాలో 4 పాయింట్లు చేరతాయి. అప్పుడు ఆ జట్టే భారత్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది. ఆసీస్ ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా రద్దైతే అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడకుండా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా.. భారత్‌పై ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సి ఉంటుంది.
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), సంజు శాంసన్ (వికెట్-కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా.












Click it and Unblock the Notifications