Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BSF అదరహో-వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో పతకాల వర్షం..!

భారత సైన్యం అంటే కోట్లాది భారతీయులకు గర్వకారణం. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) జవాన్లు దేశ ప్రజలను రక్షించడంతో పాటు భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను అంకితం చేస్తూ దేశానికి తమదైన సేవను సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఎస్‌ఎఫ్ జవాన్లు క్రీడా రంగంలోనూ భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. 2025 ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్‌లో బీఎస్‌ఎఫ్ బృందం 73 పతకాలు సాధించింది.

భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) 2025 ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి దేశానికి గర్వకారణంగా నిలిచింది. అమెరికాలోని అలబామాలో జరిగిన ఈ క్రీడా పోటీల్లో బీఎస్‌ఎఫ్ క్రీడాకారులు 38 స్వర్ణాలు, 21 వెండి, 14 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 73 పతకాలు సాధించారు. ఈ విజయం వారి శారీరక, మానసిక సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పింది. దేశ రక్షణతో పాటు క్రీడా రంగంలోనూ అసాధారణ ప్రతిభ కనబరిచి బీఎస్‌ఎఫ్ జవాన్లు ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

ఏయే విభాగాల్లో సాధన?

బీఎస్‌ఎఫ్ ఎక్కువ పతకాలు సాధించడంలో ప్రతి క్రీడాకారుడి ప్రదర్శన, కఠిన శిక్షణ, క్రమశిక్షణ, అంకితభావం నిదర్శనంగా నిలిచాయి. బీఎస్‌ఎఫ్ బృందం వివిధ క్రీడల్లో సాధించిన విజయాలు పతకాల ఇలా ఉన్నాయి. స్విమ్మింగ్‌లో 14 స్వర్ణాలు, 12 వెండి, 11 కాంస్య పతకాలు, అథ్లెటిక్స్‌లో 12 స్వర్ణాలు, 6 వెండి, 3 కాంస్య పతకాలు, ఆర్చరీలో 4 స్వర్ణాలు, 2 వెండి పతకాలు సాధించారు. దీంతో పాటు కుస్తీలో 4 స్వర్ణాలు, బాక్సింగ్‌లో 3 స్వర్ణాలు, టేక్వాండో విభాగంలో ఒక స్వర్ణం, ఒక వెండి పతకం వచ్చాయి.

ప్రపంచ పోలీస్ మరియు అగ్నిమాపక క్రీడా పోటీలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ క్రీడా పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొంటారు. ఈ ఏడాది 60 క్రీడాంశాల్లో 70 దేశాలకు పైగా ప్రాతినిధ్యం వహిస్తూ 10,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీలు అథ్లెటిక్ ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా ప్రపంచ సౌభ్రాతృత్వం, క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడానికి తోడ్పడతాయి.

మొత్తంగా, బీఎస్‌ఎఫ్ జవాన్లు 2025 ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి దేశానికి గర్వకారణంగా నిలిచారు. వారి విజయాలు దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+