20 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన స్టార్ క్రికెటర్..?
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజున ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం..ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు.
సినిమా వాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా క్రికెటర్లు సైతం విడాకులు తీసుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా, షమీ, దినేశ్ కార్తీక్, శిఖర్ ధావన్ వంటి ఇండియాన్ క్రికెటర్లు తమ జీవిత భాగస్వామి నుంచి విడాకులు తీసుకున్నారు.టీమిండియా స్టార్ బౌలర్ చాహల్ సైతం తన భార్య ధనశ్రీకి విడాకులు ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ జంట ఇప్పటికే సపరేటుగా ఉంటున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో మాజీ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్తి అహ్లావత్ అనే అమ్మాయిని సెహ్వాగ్ 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి వైవాహిక జీవితం 20 ఏళ్ల పాటు సజావుగానే సాగింది.

అయితే కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. దీని కారణంగానే ఏడాది నుంచి వీరు విడివిడిగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. గతేడాది జరిగిన దీపావళి వేడుకల్లో సైతం సెహ్వాగ్ తన ఒక్కడి ఫొటోను మాత్రమే షేర్ చేశారు. తాజాగా వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకర్ని అన్ ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. దీంతో తన భార్య ఆర్తి అహ్లావత్‌తో సెహ్వాగ్ 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ఆయన ముగింపు పలుకుతున్నట్టు సమాచారం. అయితే, విడాకుల అంశంపై వీరూ కానీ, ఆర్తి కానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.












Click it and Unblock the Notifications