వరల్డ్ కప్ గెలిచేది ఆ జట్టే- నో డౌట్: అడ్వాన్స్ విషెస్ కూడా
అహ్మదాబాద్: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఆసక్తికరమైన మ్యాచ్. ఆస్ట్రేలియా కీలక మ్యాచ్ ఆడుతోంది. న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటోంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ గేమ్ మొదలైంది. సమవుజ్జీల మధ్య పోరు ఇది. స్టేడియంలో పరుగుల వరద పారుతోంది.
టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ను ఎంచుకుంది న్యూజిలాండ్. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 26 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్- 109, డేవిడ్ వార్నర్- 81 పరుగులతో చెలరేగారు. ఓవర్‌కు తొమ్మిది చొప్పున పరుగులను పిండుకున్నారు. వారిద్దరూ అవుట్ అయిన తరువాత స్కోర్ బోర్డ కొంచెం నెమ్మదించింది. స్మిత్, మిఛెల్ మార్ష్ క్రీజ్‌లో ఉన్నారు.

ఆదివారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడబోతోంది భారత జట్టు. ఇంగ్లాండ్‌ను ఢీ కొట్టబోతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు లక్నో చేరుకున్నాయి. నెట్ ప్రాక్టీస్‌లో తలమునకలయ్యాయి.
ఇంగ్లాండ్‌కు అగ్ని పరీక్ష వంటి మ్యాచ్ ఇది. వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్స్ చేరాలంటే భారీ తేడాతో టీమిండియా ఓడించాల్సి ఉంటుందా జట్టుకు. గెలిచినా పెద్దగా ఉపయోగపడకపోవచ్చు కూడా. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లు ఆడగా నాలుగింట్లో దారుణంగా ఓడింది. చివరికి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో కూడా పరాజయాన్ని చవి చూసింది.

భారత్ సహా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్‌లతో తన తదుపరి మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఆ జట్టు సెమీస్ చేరుకుంటుందనే ఆశలు ఎవరికీ పెద్దగా లేవు. భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్యే సెమీ ఫైనల్స్ ఉంటాయనే అంచనాలు సర్వత్రా వ్యక్తమౌతోన్నాయి. ఇప్పుడు టీమిండియా దూకుడు చూస్తోంటే సెమీస్‌లో ప్రత్యర్థి ఎవరైనా భారత్ ఖచ్చితంగా గెలుస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
ఈ పరిస్థితుల్లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజా మీడియా ముందుకొచ్చారు. ఎఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్ ఖచ్చితంగా మరోసారి వరల్డ్ కప్ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. అడ్వాన్స్‌గా విషెస్ కూడా తెలియజేశారామె.

లీగ్ దశలో న్యూజిలాండ్‌పై గెలవడం ద్వారా 20 ఏళ్ల చెత్త రికార్డును టీమిండియా చెరిపేసిందని, ఇక అదే దూకుడుతో ఫైనల్స్ చేరుకోవడంతో పాటు ఛాంపియన్‌గా ఆవిర్భవిస్తుందనీ రివాబా అన్నారు. ఓ సగటు అభిమానిగా భారతజట్టు గెలవాలనే తాను కోరుకుంటోన్నానని, ప్రతి ఒక్కరిదీ ఇదే అభిప్రాయమని చెప్పారు.
టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజాది కీలకమైన స్థానమని రివాబా అన్నారు. తీవ్ర ఒత్తిడి, సవాళ్లతో కూడుకున్న స్థానం అని, అలాంటి అనుభవాలను ఎన్నో ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. జట్టు కోచ్, ఇతర ప్లేయర్ల ఆశలను ఎప్పటికీ వమ్ము చేయరని చెప్పారు. జట్టు విజయాల్లో తన భర్త కీలక పాత్ర పోషిస్తోండటం తనకు ఆనందాన్నిస్తోందని పేర్కొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications