సెమీ ఫైనల్స్ రేసులో ఉన్న ఆ రెండు జట్లకూ ఎసరు పెట్టిన పాకిస్తాన్

కోల్‌కత: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌ రసవత్తర స్థాయికి చేరుకుంది. 70 శాతం టోర్నమెంట్ ముగిసినట్టే. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏడు, మిగిలిన జట్లు ఆరు చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. అయినప్పటికీ- ఏ జట్టు సెమీ ఫైనల్స్ చేరుకుంటుందనేది ఖరారు కావాట్లేదు. ఒక్క టీమిండియా మినహా అన్ని జట్లూ పరాజయాలను చవి చూసినవే కావడం ఆసక్తికరంగా మారింది.

డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించడంతో సెమీ ఫైనల్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. సెమీస్ రేసులోకి పాకిస్తాన్ కూడా దూసుకొచ్చింది ఈ ఒక్క విజయంతో. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచిందా జట్టు. టాప్ 4లో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు సవాల్ విసురుతోంది.

CWC 2023 semifinal scenario: How pakistan will enter semi final of iccworldcup2023

తన తదుపరి మ్యాచ్‌లల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ను ఢీకొట్టాల్సి బాబర్ ఆజమ్ సేనకు. ఈ రెండింటినీ గెలిస్తే ఆ జట్లు పాయింట్లు పెరుగుతాయి. 10కి చేరుకుంటాయి. న్యూజిలాండ్‌పై గెలిస్తే ఆ జట్టు సెమీ ఫైనల్స్‌కు ఉన్న అవకాశాలను దెబ్బకొట్టినట్టవుతుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో సమానంగా నిలుస్తుంది.

పాయింట్లల్లో పాకిస్తాన్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్న శ్రీలంక జట్టు తన తదుపరి మ్యాచ్‌లల్లో ఒక్కటైనా ఓడిపోవాలి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు తమ తదుపరి మ్యాచ్‌లల్లో ఓడిపోవడం అంటూ జరిగితే- పాకిస్తాన్ సెమీ ఫైనల్స్ చేరుకునే అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఇక్కడ నెట్ రన్‌రేట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

బంగ్లాదేశ్‌పై మంచి రన్‌రేట్‌తో గెలవడం పాకిస్తాన్ సెమీస్ ఆశలకు ఊపిరిపోసినట్టయింది. ఎటొచ్చీ న్యూజిలాండ్ లేదా ఆస్ట్రేలియా జట్లపై పాకిస్తాన్ గెలుపు ప్రభావం పడింది. ఈ రెండు జట్లూ తమ తదుపరి మ్యాచ్‌ల్లలో ఒకట్రెండు మ్యాచ్‌లను ఓడిపోయిన అది పాకిస్తాన్‌కు ప్లస్ అవుతుంది.

కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించిన విషయం తోలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను 204 పరుగుల వద్దే కట్టడి చేసింది. అనంతరం దీన్ని మూడు వికెట్ల నష్టానికి కొట్టేసింది. మైనస్ 0.024 నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+