డబ్బుకు తగ్గట్టే ఆట..సన్ రైజర్స్ ఆటగాడు సంచలన కామెంట్స్

డేవిడ్ వార్నర్ ..పేరుకే ఆస్డ్రేలియా క్రికెటర్ అయినప్పటికీ, ఇండియా అభిమానులు అతన్ని బాగానే ఓన్ చేసుకున్నారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ టీంకు ఆడినప్పుడు హైదరాబాదీల మనస్సులను దోచుకున్నాడు. అభిమానులు ముద్దుగా డేవిడ్ భాయ్ అని పిలిచేవారు. 2016లో డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ టీంకు ఐపీఎల్‌ కప్‌ను కూడా అందించాడు. మరోసారి జట్టును ఫైనల్‌కు కూడా చేర్చాడు. అలాంటి ఆటగాడిని విభేదాలు తలెత్తడంతో సన్ రైజర్స్ యాజమాన్యం జట్టు నుంచి తొలగించింది. డేవిడ్ వార్నర్ 2025 ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. దీని కారణంగా అతను ఈ సంవత్సరం ఐపీఎల్‌లో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం లేదు.అయితే, అతను ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ తన స్థాయికి తగ్గట్టు రాణించక లేకపోతున్నాడు. తాజాగా మీడియా సమావేశంలో డేవిడ్ వార్నర్ ఫాం గురించి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్‌లో ఆడినట్టుగా మీరు పాకిస్తాన్ సూపర్ లీగ్‌‌లో ఎందుకు ఆడటం లేదని మీడియా ప్రతినిధి వార్నర్ ప్రశ్నించారు.దీనికి వార్నర్ నవ్వుతూ "ఎంత డబ్బు ఇస్తారో, అంతే ప్రదర్శన ఇస్తాం" అంటూ ఫన్నీగా ఆన్సర్ చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు.PSL 2025 డ్రాఫ్ట్‌లో కరాచీ కింగ్స్ జట్టు ప్లాటినం కేటగిరీలో తమ మొదటి పిక్‌గా డేవిడ్ వార్నర్‌ను ఎంచుకుంది. ఈ కేటగిరీలో ఆటగాళ్లకు గరిష్టంగా $300,000 USD (సుమారుగా ₹2.57 కోట్లు లేదా PKR 8.42 కోట్లు) వరకు చెల్లించవచ్చు. అతనికి సుమారుగా ₹2.57 కోట్ల వేతనం లభిస్తుంది. దీనితో అతను PSL 2025 యొక్క అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

David Warner commented that it was a game that was worth the money

ఇక డేవిడ్ వార్నర్ ఒకప్పడు ప్రతినిధ్యం వహించిన సన్ రైజర్స్ టీం విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతానికి భిన్నంగా చాలామంది అభిమానులు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. క్రికెట్ అభిమానులు సైతం ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.టోర్నీకి ముందు ఇక కప్ తీసుకోవడమే ఆలస్యం అన్నట్టుగా ప్రచారం చేశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే సీజన్ తొలి మ్యాచ్‌ను ఘనంగా ప్రారంభించింది.తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌‌ను ఓడించి తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది.

అయితే ఇదే జోరును సన్ రైజర్స్ హైదరాబాద్ కొనసాగించలేకపోయింది. వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైయెస్ట్ స్కోర్‌ను ఛేజింగ్ చేసి ఫ్లే ఆఫ్ రేసులో నిలిచింది. అయితే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి, ఫ్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఈ సీజన్‌లో సన్ రైజర్స్ కథ దాదాపు ముగిసినట్టే. మిగిలిన 7 మ్యాచ్‌ల్లో 6 తప్పక గెలవాల్సిన పరిస్థితి అది కూడా , మంచి రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంటుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప, సన్ రైజర్స్ ప్లే ఆఫ్‌కు చేరడం కష్టమే. అసలు ఈ సీజన్ టీం సెలక్షన్ బాలేదని అభిమానులు మండిపడుతున్నారు. గతేడాది జరిగిన వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో సన్ రైజర్స్ విఫలం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+