టీమిండియాకి రివేంజ్ ఛాన్స్ వచ్చిందా.. పాక్ మైనస్ ఏంటి ?

ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల ఫైట్ కు రంగం సిద్దమైంది. దుబాయ్ వేదికగా భారత్, పాక్ తలపడనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు ఫైనల్స్‌లో తలపడగా టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిసారిగా జరగడం అందులోనూ భారత్ ఫైనల్‌కి వెళ్లి పాక్‌పై ఓడిపోవడాన్ని టీమిండియా ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

2017 మ్యాచ్ హైలెట్స్..

2017 ఫైనల్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్ మెన్ లలో ఫఖర్ జమాన్ 114 పరుగులతో చెలరేగగా.. అజర్ అలీ, మహమ్మద్ హఫీజ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. భారీ స్కోరును చేధించే క్రమంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. హార్దిక్ పాండ్యా 43 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 76 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. పాండ్యా రనౌట్ అయ్యాక మిగిలిన బ్యాట్స్ మెన్ కూడా వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో కేవలం 30.3 ఓవర్లలోనే 158 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. దాంతో పాకిస్తాన్ 180 పరుగుల భారీ విజయంతో తొలిసారి ఛాంపియన్స్‌గా నిలిచారు.

Did Team India get a chance of revenge What is the minus of Pakistan

ఈ క్రమంలోనే మళ్లీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ వేదికగానే పాక్‌పై రివేంజ్ తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి ఫామ్ లో ఉండగా.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడితే సెమీస్ ఆశలు గల్లంతు అవుతాయి. దాంతో పాకిస్తాన్ కి ఇది డూ ఆర్ డై మ్యాచ్ కానుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన జట్టులో ప్రస్తుతం భారత ఆటగాళ్లు నలుగురు ఉండగా పాకిస్తాన్ నుంచి ఒకే ఒక్క ప్లేయర్ ఉన్నాడు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉంటే.. పాకిస్తాన్ నుంచి బాబర్ ఆజామ్ ఉన్నాడు.

ఎవరిది పైచేయి..

ప్రస్తుతం గత మ్యాచ్‌లను బట్టి ఇరు జట్లను పరిశీలిస్తే.. భారత జట్టు ప్లేయర్లలో వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలతో శుభ్ మన్ గిల్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రోహిత్‌ అదిరిపోయే ఆరంభానికి.. విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. బంగ్లాతో మ్యాచ్ లో కేఎల్ రాహుల్‌ ఆకట్టుకోగా.. శ్రేయస్, హార్థిక్, జడేజా చెలరేగితే టీమిండియా భారీ స్కోరు చేయడం ఖాయం. బౌలింగ్‌లో షమీ అద్భుతంగా రాణించడంతో టీమిండియా బలం మరింత పెరిగినట్లైంది.

ఇక పాక్ విషయానికి వస్తే.. జట్టు పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓటమి చెందడం ఒక వైపు ఉంటే.. బాబర్‌ ఆజమ్ పైనే ప్రధానంగా ఆధారపడుతుంది. ఫఖర్‌ జమాన్ గాయంతో దూరం కావడం ఒక పెద్ద మైనస్ అని భావిస్తున్నారు. ఇమామ్‌, రిజ్వాన్, షకీల్‌ ఆశించిన స్థాయిలో రాణించక పోవడం వారిని నిరాశకు గురి చేస్తోంది. మరోవైపు బౌలింగ్ విషయంలో కూడా ముగ్గురు పేసర్లు పోటీ పడి మరి పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరి విజయంతో రివేంజ్ తీర్చుకొని సెమీస్‌ బెర్తును భారత్ ఫిక్స్ చేసుకుంటుందా.. లేక డూ ఆర్ డై పరిస్థితుల్లో పాక్‌ గెలుపొందుతుందా అనే చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+