కొహ్లీ-రోహిత్ ను ఇబ్బందిపెట్టాలని చూస్తే..! గంభీర్ కు రవిశాస్త్రి వార్నింగ్..!
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ల కంటే స్టార్ క్రికెటర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మతో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయాలపైనే ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక తల పట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత క్రికెట్లో మేటి క్రికెటర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్ ను ఇబ్బందిపెట్టాలని ప్రయత్నిస్తున్న వారిపై టీమిండియా మాజీ కోచ్ కూడా అయిన రవిశాస్త్రి తీవ్ర విమర్శలు చేశారు. అలాగే సమస్యలను సృష్టించేవారికి కఠినమైన హెచ్చరికలు చేశారు. వన్డే దిగ్గజాలు కోహ్లీ, రోహిత్ కెరీర్‌ల ఖ్యాతితో ఆడుకోవద్దని విమర్శలకు సూచించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే దిగ్గజాలు. మీరు ఆ స్థాయి ఆటగాళ్లతో గొడవ పడకండి అని వారికి తన తాజా ఇంటర్వూలో సలహా ఇచ్చారు.

అయితే రవిశాస్త్రి కొహ్లీ-రోహిత్ విషయంలో ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే పరోక్షంగా గంభీర్ పై స్పందిస్తూ.. కొంతమంది చేస్తున్నారు. అంతే నేను చెబుతాను అంటూ హెచ్చరికలు చేశారు. ఈ రెండు స్విచ్‌లను సరిగ్గా ఆన్ చేస్తే, రైట్ బటన్‌లను నొక్కితే, గందరగోళంలో ఉన్న వారందరూ సీన్ నుంచి త్వరగా అదృశ్యమవుతారంటూ వారి ప్రత్యర్థులకు హెచ్చరికలు చేశారు. ఇలాంటి ఆటగాళ్ల (రోహిత్-కొహ్లీ) విషయంలో మీరు దారుణంగా వ్యవహరించవద్దని రవిశాస్త్రి సూచించాడు. అయితే ఈ ఇంటర్వ్యూలో రవిశాస్త్రిని ఎవరు అలా చేస్తున్నారని ప్రశ్నిస్తే.. చేసే వాళ్లు చేస్తున్నారని బదులిచ్చారు.

తాజాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు ముందు కొహ్లీ-రోహిత్ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వేళ వారిని దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని గంభీర్ చెప్పినట్లు వార్తలొచ్చాయి. అలాగే దక్షిణాఫ్రికా సిరీస్ లో రాణించిన తర్వాత కూడా వారిని టార్గెట్ చేస్తూ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం పాడు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా రంగంలోకి దిగి ముందు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అగార్కర్ ను మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించింది. చివరి నిమిషంలో ఆయన్ను ఆపి మరో సెలక్టర్ ప్రజ్ఞాన్ ఓజాను చర్చలకు పంపింది. అయినా గొడవ మాత్రం సద్దుమణగలేదు. అదే సమయంలో కొహ్లీ, రోహిత్ ఫామ్ లోకి వచ్చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications