డోపింగ్ టెస్ట్‌లో టీమిండియా క్రికెటర్లు..లిస్ట్‌లో ఉన్నది వీళ్లే
డోపింగ్ టెస్టు అనేది క్రీడాకారులు నిషిద్ధమైన మందులు లేదా పదార్థాలను ఉపయోగించారో లేదో నిర్ధారించడానికి చేసే ఒక పరీక్ష. ఇది క్రీడల్లో సమానత్వాన్ని కాపాడటానికి మరియు క్రీడాకారుల ఆరోగ్యాన్ని రక్షించడానికి చాలా ముఖ్యమైనది.డోపింగ్ అంటే క్రీడా పనితీరును మెరుగుపరచడానికి నిషిద్ధమైన మందులు లేదా పదార్థాలను ఉపయోగించడం. ఈ పదార్థాలు కండరాల పెరుగుదల, శక్తి స్థాయిలను పెంచడం లేదా నొప్పిని తగ్గించడం వంటివి చేస్తాయి.
తాజాగా యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) 2025 సంవత్సరానికిగానూ.. 'రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్'లో అథ్లెట్ల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాళ్ల పేర్లను సైతం చేర్చింది. సూర్య, బుమ్రా, గిల్, పంత్, పాండ్యాతోపాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్, అర్ష్‌దీప్ సింగ్, సంజూ శాంసన్, తిలక్ వర్మలను కొత్త లిస్ట్‌లో చేర్చారు. ఈ లిస్ట్‌లో మహిళా క్రికెటర్ల పేర్లు కూడా ఉన్నారు. షెఫాలీ వర్మ, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, పేసర్ రేణుక సింగ్‌ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలోని క్రికెటర్ల నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించి డోపింగ్ టెస్టు నిర్వహించనున్నారు. టీమిండియా జట్టు ప్రస్తుతం టీ20లు ఆడుతోంది.

అయినప్పటికీ ఆటగాళ్ల దగ్గర నుంచి ఈ సమయంలోనే శాంపిల్స్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. నాడా ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్టు సమాచారం. డోపింగ్ టెస్టులో సాధారణంగా మూత్రం లేదా రక్తం నమూనాలను తీసుకుంటారు. ఈ నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించి, నిషిద్ధమైన పదార్థాలు ఉన్నాయో లేదో నిర్ధారిస్తారు.డోపింగ్ చేసినట్లు నిర్ధారణ అయితే, ఆ క్రీడాకారుడిని క్రీడల నుండి నిషేధించవచ్చు. అంతేకాకుండా, వారికి ఆర్థిక జరిమానాలు కూడా విధించవచ్చు.2020లో తొలిసారిగా పుజారా, జడేజా, కేఎల్ రాహుల్, స్మృతి మంధాన, దీప్తి శర్మలను ఆర్‌టీపీలో చేర్చింది. 2019 నుంచి బీసీసీఐ కూడా నాడా పరిధిలోకి వచ్చింది.












Click it and Unblock the Notifications