పాక్, బంగ్లా తీసుకున్న నిర్ణయం కరెక్ట్: బీసీసీఐకి ఇంగ్లాండ్ లెజెండ్ బిగ్ షాక్!
టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. భారత్‌లో ఆడేందుకు భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ నిరాకరించడం, దానికి మద్దతుగా పాకిస్థాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ కప్ వేదికగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన బీసీసీఐ, ఐసీసీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
వివాదానికి కారణం ఏమిటంటే?
ఈ సంక్షోభం ఐపీఎల్ 2026 నుంచి మొదలైందని నాజర్ హుస్సేన్ గుర్తు చేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరపున ఆడుతున్న బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రాజకీయ కారణాలతో జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ ఆదేశించడమే ఈ గొడవకు ఆజ్యం పోసింది. దీంతో ఆగ్రహించిన బంగ్లాదేశ్ బోర్డు, భారత్‌లో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరింది. ఐసీసీ అందుకు నిరాకరించడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంది. వారి స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది.

పాకిస్థాన్ మద్దతు - నాజర్ హుస్సేన్ విశ్లేషణ
బంగ్లాదేశ్ వైఖరికి పాకిస్థాన్ మద్దతు తెలపడంపై ఓ పాడ్‌కాస్ట్‌లో మైఖేల్ అథర్టన్‌తో మాట్లాడుతూ నాజర్ హుస్సేన్ ఇలా అన్నారు. "బంగ్లాదేశ్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండటం నాకు నచ్చింది. తమ ఆటగాడు ముస్తాఫిజుర్ కోసం వారు గట్టిగా నిలబడ్డారు. అలాగే పాకిస్థాన్ కూడా బంగ్లాదేశ్‌కు మద్దతు ఇవ్వడం బాగుంది. ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు బీసీసీఐకి 'రాజకీయాలు-క్రీడలు కలపడం ఇక చాలు' అని చెప్పాల్సిన అవసరం ఉంది. పాకిస్థాన్ కేవలం ఆర్థిక పరమైన అంశాల (ఇండో-పాక్ మ్యాచ్ ఆదాయం) ద్వారానే ఐసీసీని లేదా భారత్‌ను ఇబ్బంది పెట్టగలదని, ఆ దిశగా వారు తీసుకున్న నిర్ణయం సరైనదే" అని నాజర్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.
ఐసీసీపై ప్రశ్నల వర్షం
ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని నాజర్ హుస్సేన్ విమర్శించారు. "ఒకవేళ ఇదే పరిస్థితి భారత్‌కు ఎదురైతే ఐసీసీ ఇలాగే స్పందిస్తుందా? భారత్ గనుక ఒక నెల ముందు మేము ఆ దేశానికి వెళ్లి ఆడము అని చెబితే.. ఐసీసీ వారిని టోర్నీ నుంచి తొలగించే ధైర్యం చేస్తుందా?" అని ఆయన ప్రశ్నించారు. ఐసీసీ అన్ని దేశాలను సమానంగా చూడాలని, ధనిక బోర్డులకు ఒక నీతి, పేద బోర్డులకు మరో నీతి ఉండకూడదని ఆయన హితవు పలికారు.
-
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications