గౌతమ్ గంభీర్ ఎదురుదాడి.. !!
శ్రీలంకతో కొలంబోలో జరగనున్న రెండో టెస్టు ప్రారంభానికి ముందు భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో టీమిండియా టెస్ట్ ఫార్మాట్‌లో బలహీనపడిందంటూ వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. జట్టు ప్రస్తుతం ఓ పరివర్తన దశలో ఉందని, ఇలాంటి సమయంలో కొన్ని తాత్కాలిక వైఫల్యాలు ఎదురవడం సహజమేనని అభిప్రాయపడ్డారు. విమర్శలు చేయడం సులువేనని, విజయాలు సాధించడంలోనే సవాళ్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ క్రికెటర్లు టెస్టుల నుంచి తప్పుకున్న నేపథ్యంలో జట్టు యువరక్తాన్ని నింపుకొనే దశలో ఉందని గంభీర్ పేర్కొన్నారు. ఐసీసీ ర్యాంకింగ్ ల కంటే కూడా ట్రోఫీలను సాధించడానికే తాను అధిక ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించట్లేదనే విమర్శలను గంభీర్ ఖండించాడు. ఇంగ్లాండ్ పర్యటన అనంతరం గాడిన పడిందని అన్నారు.

భవిష్యత్ అవసరాల కోసం టెస్ట్ జట్టును పునర్నిర్మిస్తోన్నామని, ఈ క్రమంలో యువతకు ప్రాధాన్యత ఇస్తోన్నామని గంభీర్ వ్యాఖ్యానించారు. జట్టులో కొత్త శకం ప్రారంభమైన వేళ శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా నాలుగో స్థానంలో నిలదొక్కుకుంటున్నాడని గంభీర్ ప్రశంసించారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న దేవ్‌దత్ పడిక్కల్ కూడా చక్కని ఆటతీరును ప్రదర్శిస్తోన్నాడని, ఎడంచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ ఓ స్టార్ ఎదుగుతున్నాడని అన్నారు. ఫ్యూచర్ ప్లాన్ లల్లో అతను కీలకమని చెప్పారు.
కొలంబో టెస్టు కోసం రవీంద్ర జడేజా, కుల్ దీప్ యాదవ్‌తో పాటు మధ్యప్రదేశ్ రంజీ ఆటగాడు సారాంశ్ జైన్ కూడా ఎంపిక అయ్యే అవకాశాలు లేకపోలేదని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. మ్యాచ్ జరగబోయే పరిస్థితులను అంచనా వేసి 20 వికెట్లు పడగొట్టే సామర్థ్యం గల మేటి బౌలింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతామని అన్నారు. ఒకటి రెండు వైఫల్యాల ఆధారంగా ప్లేయర్లను తప్పించడం తన నైజం కాదని, ప్రతిభావంతులకు సుదీర్ఘ అవకాశం కల్పించడమే విధానమని గంభీర్ తెలిపారు.
శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ను రెండు మ్యాచ్‌లకే పరిమితం చేయడం పట్ల గంభీర్ స్పందించారు. కనీసం మూడు టెస్టుల సిరీస్ ఉంటే బాగుంటుందని విశ్లేషించారు. మొదటి మ్యాచ్‌లో ఏ జట్టయినా ఓడిపోయినప్పటికీ, తిరిగి సిరీస్‌లోకి పుంజుకోవడానికి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ సరైన అవకాశాన్ని కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. రెండు టెస్టులు మాత్రమే ఉంటే మొదటి మ్యాచ్ కోల్పోయిన జట్టుకు తిరిగి కోలుకునే అవకాశం లభించడం కష్టమని అన్నారు.














Click it and Unblock the Notifications