రాహుల్ ద్రావిడ్‌కు గుడ్ బై: వారసుడు ఖరార్..!!

Rahul Dravid: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌ పేరు ఖరారైంది. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా అపాయింట్ కానున్నారు. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న రాహుల్ ద్రావిడ్ స్థానంలో గంభీర్‌ అయ్యారు. ఆయన పేరును ఈ నెలాఖరున అధికారికంగా ప్రకటించనుంది బీసీసీఐ.

రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ ఇదివరకే ముగిసింది. జూన్ 29వ తేదీ నాటికే ఆయన కాల పరిమితి ముగిసింది. దాన్ని రెన్యూవల్ చేయలేదు. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఆయనను అదే హోదాలో కొనసాగిస్తోంది. ఈ నెల 29వ తేదీన టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్. దీనితో ఈ బిగ్గెస్ట్ టోర్నమెంట్‌కు తెర పడుతుంది.

Gautam Gambhir set to be announced as the next head coach of Team India

ఫైనల్స్ ముగిసిన తరువాత రెండు రోజుల్లో టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సూపర్ 8కు చేరింది. ఈ నెల 19వ తేదీ నుంచి సూపర్ 8 మ్యాచ్‌లు ఆరంభమౌతాయి. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్, బంగ్లాదేశ్.. ఇందులో తలపడనున్నాయి.

హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించింది బీసీసీఐ. మే 27వ తేదీని డెడ్ లైన్‌గా పెట్టి.. అప్లికేషన్లను ఆహ్వానించింది. వాటన్నింటినీ వడబోసింది. ఆ తరువాత గౌతమ్ గంభీర్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన మాజీ టెస్ట్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేస్తాడని ఆశించినప్పటికీ- అలా జరగలేదు.

ఆయన ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. ఇదివరకు తాత్కాలికంగా టీమిండియాకు హెడ్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉందాయనకు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చీఫ్‌గా వ్యవహరిస్తోన్నారు లక్ష్మణ్. దీన్ని కాదనుకుని హెడ్ కోచ్‌గా దరఖాస్తు దాఖలు చేయలేదు.

ఐపీఎల్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌ మెంటార్‌గా వ్యవహరిస్తోన్నాడు గౌతమ్ గంభీర్. ఈ సీజన్‌లో తన జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టగలిగాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీమిండియాకు హెడ్ కోచ్‌గా అతన్నే అపాయింట్ చేయాలని బీసీసీఐ దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దీన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+