Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ind-SA T20I: సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడేది వీళ్లే..! గిల్, హార్దిక్ రిటర్న్స్..!

భారత్ తో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ లు పూర్తయ్యాయి. ఇప్పుడు టీ20ల వంతు వచ్చింది. రేపు కటక్ లో జరిగే తొలి టీ20తో ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కాబోతోంది. దీంతో రేపు జరిగే ఆరంభ మ్యాచ్ కోసం టీమిండియాలో ఆడే 11 మంది ఆటగాళ్లను జట్టు మేనేజ్ మెంట్ ఖరారు చేసింది. ఇందులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. టెస్టు సిరీస్ వైట్ వాష్ తర్వాత వన్డే సిరీస్ ను అతి కష్టం మీద గెల్చుకున్న భారత్ కు ఈ సిరీస్ కీలకంగా మారింది.

రేపు కటక్ లో జరిగే తొలి టీ20 కోసం మేనేజ్ మెంట్ ఖరారు చేసిన జట్టులో రెగ్యులర్ వన్డే కెప్టెన్ శుభ్ మన్ గిల్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చారు. గాయాల కారణంగా ఆటకు దూరంగా ఉన్న వీరిద్దరూ కోలుకోవడంతో తిరిగి తీసుకున్నారు. ఈ ఏడాది ఆసియా కప్ సమయంలో పాండ్యా గాయంతో ఫైనల్‌కు దూరమయ్యాడు. అలాగే గిల్ మెడ గాయం కారణంగా 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆడలేకపోయాడు. ఆ తర్వాత వన్డేలకూ దూరంగా ఉన్నాడు. తాజాగా ఫిట్ నెస్ సాధించాడు.

Gill Back in Action Rana Misses Out India s Probable XI for 1st T20I vs South Africa

కటక్ టీ20లో గిల్, అభిషేక్ శర్మ జోడీ భారత్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వన్ డౌన్ లో వస్తాడు. ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ నాలుగో స్ధానంలో రానున్నాడు. ఆ తర్వాత సంజూ శ్యాంసన్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బౌలింగ్ విషయానికొస్తే ఫామ్ తో ఇబ్బందులు పడుతున్న పేసర్ హర్షిత్ రాణాను టీ20ల నుంచి తప్పించారు. వన్డేలకు రెస్ట్ ఇచ్చిన బుమ్రాతో పాటు అర్ష్ దీప్ పేస్ దాడి ఆరంభిస్తారు. కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ రూపంలో స్పిన్నర్లు అందుబాటులో ఉంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+