సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్..డేంజరస్ ప్లేయర్ వచ్చేశాడు..!

మరో వారం రోజుల్లో ఐపీఎల్ పండుగ మొదలుకానుంది. మార్చి 22 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.గతేడాది జరిగిన వేలంలో కీలక ఆటగాళ్లను ఆయా జట్లు కోట్లు చెల్లించి దక్కించుకున్నాయి. ఇక గతేడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అదరగొట్టింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ టోర్నీ ఆద్యంతం ఆకట్టుకుంది.టోర్నీ మొత్తం అద‌ర‌గొట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ కీలక‌మైన ఫైన‌ల్లో మాత్రం చేతులేత్తేసింది. ఐపీఎల్‌-2024 సీజ‌న్ ర‌న్న‌ర‌ప్‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిలిచిన సంగ‌తి తెలిసిందే.

అయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా గతేడాది చేజారిన టైటిల్‌ను ఈ ఏడాది సొంతం చేసుకోవాలని ఆ జట్టు భావిస్తోంది.కెప్టెన్ కమిన్స్ కూడా జట్టుతో చేరడంతో సన్‌రైజర్స్‌కు మరింత బలం చూకూరినట్టు అయింది. ఇదే సమయంలో మొదటి మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ టీంకు గుడ్ న్యూస్ అందింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి టీంలో చేరనున్నాడు.ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డికి గాయం అయింది. దీంతో అతను ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. గాయం కావడంతో నితీశ్ కుమార్ రెడ్డి ఐపీఎల్-2025లో జరిగే కొన్ని మ్యాచులకు దూరం అవుతాడని జట్టు యాజమాన్యం ప్రకటించింది.

Good news for Sunrisers Hyderabad Dangerous player joins the team

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నితీశ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించినట్టు తెలుస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్ అతనికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చినట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి.యో యో టెస్టులోనూ నితీశ్ కుమార్ రెడ్డి పాస్ అయ్యాడు. దీంతో అతను సన్‌రైజర్స్‌ టీంలో చేరనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ విజయాల్లో నితీశ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు.గతేడాది జరిగిన సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 303 రన్స్ చేయడంతోపాటు 3 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.దీంతో ఈ సీజన్ కోసం కావ్య పాప అతనికి రూ. 6 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 23న రాజస్థాన్‌తో ఆడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+