హార్దిక్ పాండ్యా కొంపముంచిన ఆ ఎఫైర్..?
గతం వారం రోజులుగా సోషల్ మీడియా మొత్తం కూడా టీమిండియా ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకుల గురించే విపరీతమైన చర్య సాగుతోంది. హార్దిక్ పాండ్యాకు అతని భార్య నటాషా విడాకులు ఇవ్వడానికి రెడీ అయిందని తెలుస్తోంది. నెటిజన్లు ఇలా చర్చించుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. ఐపీఎల్ ప్రతి సీజన్‌లో నటాషా కనిపించి తన భర్తకు సపోర్ట్ చేసేది. అయితే ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా పాండ్యా అరంగేట్రం చేసినా.. నటాషా మాత్రం కనిపించలేదు. అలాగే, అతను ఏ మ్యాచ్ చూసేందుకు రాలేదు.
అలాగే మార్చి 4 నటాషా పుట్టినరోజు. ఆ రోజు, హార్దిక్ పాండ్యా తన భార్యకు సోషల్ మీడియాలో ఒక్క పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా పోస్ట్ చేయలేదు.దీనికి తోడు నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించింది. దీంతో నటాషా హార్దిక్ పాండ్యాకు విడాకులు ఇవ్వడం ఖాయమనే అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది. 'ఒకరు రోడ్డున పడబోతున్నారు' అనే క్యాప్షన్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫొటో షేర్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యను ఉద్దేశించి పెట్టిందంటూ నెట్టింట రచ్చ మొదలు పెట్టారు నెటిజన్లు.

ఇక విడాకులు వార్తలు వినిపిస్తోన్న సమయంలోనే నటాషా మరో వ్యక్తితో క్లోజ్‌గా కనిపిస్తూ దర్శనం ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశాపటానీ బాయ్‌ఫ్రెండ్‌గా చెప్పుకుంటున్న అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో మీడియా కంటబడింది నటాషా. పాండ్యాతో విడాకుల వార్తలపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నవ్వేసి 'థ్యాంక్యూ'అని వెళ్లిపోయారు. హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన తర్వాతే ఆమె అలెగ్జాండర్ అలెక్సిలిక్‌తో రిలేషన్‌ను మెయిన్‌టైన్ చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే విడాకులపై అటు నటాషా కానీ, ఇటు పాండ్యా కానీ ఎక్కడా తమ విడాకులపై బహిరంగంగా స్పందించలేదు.












Click it and Unblock the Notifications