టీ20 వరల్డ్ కప్ లోకి కొత్త జట్టు..! బెట్టు చేసిన బంగ్లాకు ఐసీసీ భారీ షాక్..!
భారత్-బంగ్లాదేశ్ విభేదాల నేపథ్యంలో వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ పై నెలకొన్న అనిశ్చితికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎట్టకేలకు తెరదించింది. బంగ్లాదేశ్ (bangladesh) లో హిందువుల హత్యల నేపథ్యంలో భారత్ లో నెలకొన్న పరిణామాలతో అక్కడకు తమ క్రికెటర్లను పంపేందుకు బీసీబీ నిరాకరించింది. దీంతో ఐసీసీని భారత్ లో తాము ఆడే వేదికలు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఐసీసీ ఇందుకు నిరాకరించడంతో ప్రతిష్టంభన నెలకొంది.
భారత్ లో మ్యాచ్ లు ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లను పంపేందుకు నిరాకరించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించేందుకు ఐసీసీ నిరాకరించింది. దీంతో భారత్ లో ఆడాల్సిందేనంటూ బంగ్లాదేశ్ కు అల్టిమేటం ఇచ్చింది. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో భారత్ లో తమ క్రికెటర్ల భద్రతే తమకు ముఖ్యమని బంగ్లా బోర్డు తేల్చేసింది. ఈ నేపథ్యంలో భారత్ లో మ్యాచ్ లు ఆడలేమని తాజాగా ఐసీసీకి లేఖ పంపింది. అంతే కాదు తమకకు ఐసీసీ అన్యాయం చేస్తోందని, దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలిలోని స్వతంత్ర వివాదాల పరిష్కార కమిటీ జోక్యం చేసుకోవాలని కూడా కోరింది.

అయితే ఐసీసీ మాత్రం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తుల్ని పట్టించుకోలేదు. బంగ్లాదేశ్ స్ధానంలో టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించడంలో విఫలమైన స్కాట్లండ్ జట్టుకు అవకాశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ లేఖ పంపినట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ కు వేదికైన భారత్ లో మ్యాచ్ లు ఆడబోమన్న బంగ్లాదేశ్ నిర్ణయంతో తలెత్తిన సమస్యకు పరిష్కారంగా నిబంధనల మేరకు స్కాట్లండ్ కు అవకాశం కల్పిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. దీంతో బంగ్లాదేశ్ అధికారికంగా టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నట్లయింది. ఐసీసీ నిర్ణయంతో బంగ్లాదేశ్ కు భారీ ఆర్ధిక నష్టం తప్పేలా లేదు.

మరోవైపు స్కాట్లండ్ జట్టు ఇప్పటివరకూ ఐదు టీ20 వరల్డ్ కప్ లలో ఆడింది. 2022, 2024 టీ20 వరల్డ్ కప్ లలోనూ మంచి ప్రదర్శనలు కనబరచింది. అయితే 2024 వరల్డ్ కప్ లో సైతం ఆస్టేలియా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లను ఓడించి సంచలనాలు రేపినా సూపర్ 8కు అర్హత సాధించడంలో విఫలమైంది. అర్హత మ్యాచ్ ల్లో ఇటలీ, నెదర్లాండ్స్, జెర్సీ జట్ల కంటే వెనుక ఉన్న స్కాట్లండ్ .. ఐసీసీ ర్యాంకింగ్స్ లో వీటి కంటే ముందుంది. అదే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో స్కాట్లండ్ కు అవకాశం లభించేలా చేసింది. బంగ్లా గైర్హాజరీలో ఇప్పుడు స్కాట్లండ్.. విండీస్, ఇంగ్లండ్, ఇటలీ, నేపాల్ తో కూడిన వరల్డ్ కప్ గ్రూప్ -సీలో చోటు సంపాదించింది. ఫిబ్రవరి 7న కోల్ కతాలో విండీస్ తో స్కాట్లండ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications