రోహిత్ శర్మకు ముందుంది ముసళ్ల పండగ
T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగియబోతోంది. ఈ నెల 27వ తేదీన ఫైనల్. దీని తరువాత టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ మేనియా మొదలు కానుంది. సుమారు నెల రోజుల పాటు ఉర్రూతలూగించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.జూన్ 2వ తేదీన టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. 29వ తేదీ వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికా.. సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోన్నాయి. ఈ రెండు దేశాలు కలిపి మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి.
తొలి సగం మ్యాచ్‌లు వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా అండ్ బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. మిగిలిన సగం మ్యాచ్‌లు- అమెరికాలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ స్టేడియాల్లో నిర్వహించనుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ట్రినిడాడ్, గయానాల్లో రెండు సెమీ ఫైనల్స్, బార్బడోస్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. జూన్ 9వ తేదీన ఈ దాయాదుల మధ్య పోరు ఉంటుంది. న్యూయార్క్.. దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
మన్‌హట్టన్ నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నస్సౌ కౌంటీ స్టేడియం. యునైటెడ్ స్టేట్స్ క్రికెట్, ఐసీసీ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. ఆరు నెలల కాలంలో ఈ స్టేడియం నిర్మాణం మొత్తం పూర్తయింది. ఒకేసారి 34,000 వేలమంది మ్యాచ్ చూసేలా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
మొత్తంగా టీ20 వరల్డ్ కప్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఇదే స్టేడియంలో జరుగుతాయి. ఈ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్.. జూన్ 3వ తేదీన షెడ్యూల్ అయింది. లీగ్స్ దశ గ్రూప్ డీలో భాగంగా శ్రీలంక- దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. పాకిస్తాన్‌తో కలుపుకొని టీమిండియా మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడేది ఇక్కడే.
ఈ టోర్నమెంట్ ఆడటానికి రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు శనివారం అమెరికాకు బయలుదేరి వెళ్లనుంది. ఐపీఎల్ 2024 క్వాలిఫయర్, ఫైనల్స్ ఆడబోయే ప్లేయర్లు మినహా మిగిలిన టీమ్ మొత్తం కూడా యూఎస్ వెళ్తుంది. న్యూయార్క్‌లో ల్యాండ్ అవుతుంది. నస్సౌ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది.

టీమిండియాకు సెలెక్ట్ అయిన యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చాహల్.. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడుతున్న విషయం తెలిసిందే. రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన రింకూ సింగ్ (కోల్‌కత నైట్ రైడర్స్ ), అవేష్ ఖాన్ (రాజస్థాన్ రాయల్స్) భారత్‌లోనే ఉంటారు. ఫైనల్స్ తరువాతే వాళ్లు టీమిండియాతో కలుస్తారు.
ఈ టోర్నమెంట్ రోహిత్ శర్మకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. గత ఏడాది భారత్‌లోనే జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ 2023కు కప్‌ను అందించలేకపోయాడు హిట్ మ్యాన్. లీగ్స్, సెమీ ఫైనల్స్‌లో తిరుగులేని విజయాలను అందుకున్నప్పటికీ- ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. దీనితో అందరి దృష్టీ టీ20 వరల్డ్ కప్ మీద నిలిచింది.
టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టులో - రోహిత్ శర్మ (కేప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కేప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. శుభ్‌మన్ గిల్, రింకూసింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ రిజర్వ్ ప్లేయర్లు.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!!












Click it and Unblock the Notifications