IML 2025: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ విజేత భారత్, రాయుడు అదరగొట్టాడు
IML 2025: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ విజేతగా భారత్ అవతరించింది. ఆదివారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ జట్టుపై ఇండియా మాస్టర్స్ విజయం సాధించింది. అంబటి రాయుడు అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. 17.1 ఓవర్లలోనే వెస్టిండీస్ మాస్టర్స్ విధించిన 149 పరుగుల లక్ష్యాన్ని ఇండియా మాస్టర్స్ ఛేదించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించినా ఆ తర్వాత విండీస్ బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్ స్మిత్ 35 బంతుల్లో ఆరు ఫోర్లు, 2 సిక్స్ లతో 45 పరుగులు చేశాడు. కెప్టెన్ బ్రియాన్ లారా 6 పరుగులు మాత్రమే చేశాడు. పెర్కిన్స్ కూడా 6 పరుగులకే వెనుదిరిగాడు.

సెకండ్ డౌన్‌లో వచ్చిన సిమన్స్ 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 57 పరుగులు సాధించాడు. సిమన్స్, స్మిత్ మంచి ఇన్నింగ్ నిర్మిస్తున్న ప్రయత్నంలో ఉండగా.. నదీమ్ ఒక అద్భుతమైన బాల్ వేసి స్మిత్‌ను ఔట్ చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సిమన్స్ ఆచితూచి ఆడుతూ అర్థం సాధించి విండీస్ ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. విండీస్ మంచి స్కోర్ చేరుకునేందుకు సాయపడ్డాడు. భారత్ మాస్టర్స్ బౌలర్లలో వినయ్ కుమార్ 3 వికెట్లు తీయగా.. నదీమ్ 2, బిన్నీ, నేగి చెరో వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి.. 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అంబటి రాయుడు అర్థ శతకం (50 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు)తో చెలరేగాడు. సచిన్ టెండూల్కర్ 18 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 25 పరుగులు చేశాడు. గుర్ కీరత్ సింగ్ 14పరుగులు చేశాడు.
యువరాజ్ సింగ్ 13 పరుగులు, స్టువర్ట్ బిన్నీ 16 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ విజయ తీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్లలో అప్లే నర్స్ 2 వికెట్లు పడగొట్టగా.. టినో బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు. ఇండియా మాస్టర్స్ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహించారు. ఇటీవలే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించగా.. ఇప్పుడు ఇండియా మాస్టర్స్ లీగ్ 2025 విజేతగా నిలవడంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా, సచిన్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌లో అప్పర్ కట్ షాట్ క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒక ఫోర్ తోపాటు సిక్స్ కూడా 51 ఏళ్ల వయస్సున్న సచిన్ అవలీలగా బాదడం గమనార్హం. 2003లో సచిన్ ఎలా ఆడాడో ఇప్పుడు కూడా అలాగే ఆడుతున్నాడని అభిమానులు సంబరపడిపోతున్నారు. ఆయన ఐపీఎల్ ఆడితే బాగుండేదని కోరుకుంటున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications