చివరి టీ20 మ్యాచ్ ఆడనున్న మాజీ కేప్టెన్
IND vs BAN 3rd T20: బంగ్లాదేశ్‌తో చివరి టీ20 ఇంటర్నేషనల్‌లో తలపడబోతోంది భారత జట్టు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలు కాబోతోంది. ఇందులో గెలిస్తే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినట్టవుతుంది. ఇప్పటికే 2-0 తేడాతో ఆధిక్యతలో ఉంది టీమిండియా.
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచుల్లోనూ విజయకేతనాన్ని ఎగురవేసింది. ఈ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. ఈ రెండింట్లోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది బంగ్లాదేశ్. ఇప్పుడు టీ20ల్లోనూ అదే పరిస్థితి. ఇప్పటివరకు ఆడిన రెండింట్లోనూ టీమిండియా ఎదురు లేకుండా పోయింది.

ఇది- బంగ్లాదేశ్ మాజీ కేప్టెన్ మహ్మదుల్లాకు చివరి టీ20 మ్యాచ్. ఈ ఫార్మట్ నుంచి అతను ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌తో ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో గేమ్ తరువాత తన నిర్ణయాన్ని బయటపెట్టాడు. వన్డే ఫార్మట్‌లో మాత్రం కొనసాగనున్నాడు.
2021లోనే టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు మహ్మదుల్లా. 2022లో అతనికి టీ20 టీమ్‌లో చోటు దక్కలేదు. 2022 నుంచి 2023 మధ్యకాలంలో 27 టీ20 మ్యాచ్‌లను మిస్ అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో సిరీస్‌కు సెలెక్ట్ అయ్యాడు. తొలి మ్యాచ్‌లో 54 పరుగులతో రాణించాడు. ఇది అతని కమ్ బ్యాక్ గేమ్. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయిలో ఆడట్లేదు.

మరో రెండు సంవత్సరాల్లో టీ20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉన్నందున యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. అప్పట్లోగా ఈ ఫార్మాట్‌లో మెరికల్లాంటి యువ క్రికెటర్లను తీర్చిదిద్దుకోవడానికి వీలుగా, వారికి అధిక అవకాశాలు కల్పించేలా జట్టులో తన స్థానాన్ని ఖాళీ చేశానని పేర్కొన్నాడు.
ఈ సిరీస్ అంచనాలకు తగ్గట్టుగా రాణించట్లేదు మహ్మదుల్లా. రెండో మ్యాచ్‌లో 35 బంతుల్లో మూడు ఫోర్లతో 41 పరుగులు చేశాడు. వికెట్లేమీ పడగొట్టలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫలం అయ్యాడు. ఒక పరుగుకే వెనుదిరిగాడు. చివరి మ్యాచ్ కావడం వల్ల ఇందులో గెలిచి తమ సహచరుడికి ఘనంగా వీడ్కోలు పలకాలని పట్టుదలతో ఉంది బంగ్లాదేశ్.












Click it and Unblock the Notifications