మరో యూవీ దొరికాడోచ్: ఆ వారసత్వం కంటిన్యూ
Abhishek Sharma: ఇంగ్లాండ్‌తో అయిదు టీ20ల సిరీస్‌లో టీమిండియా జైత్రయాత్ర సాగింది. 4-1 తేడాతో విజయదుందుభి మోగించింది. యంగ్ క్రికెటర్ల సత్తా చాటిందీ సిరిస్. ఐపీఎల్ ఆడిన అనుభవంతో రెచ్చిపోయారు ఈ సిరీస్ మొత్తం. పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుపడ్డారు. బౌలర్లకు చుక్కలు చూపారు.
భారత జట్టు ప్లేయర్ల విశ్వరూపానికి అద్దం పట్టింది.. ముంబై వాంఖెడే స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన చివరి టీ20 గేమ్. తొలుత బ్యాటింగ్, ఆ తరువాత బౌలింగ్‌లో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించారు. ఊపిరాడనివ్వకుండా కట్టి పడేశారు. మ్యాచ్ మొత్తం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లల్లో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. దీన్ని అందుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయింది ఇంగ్లాండ్. కనీసం వంద పరుగులు కూడా చేయలేకపోయిందంటే మన బౌలింగ్ ప్రతాపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 97 పరుగులకే కుప్పకూలింది. 150 పరుగుల తేడాతో మట్టికరిచింది.
బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ చెలరేగాడు. బౌలర్లపై మెరుపుదాడి చేశాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ఆ తరువాత ఇంకో 20 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 13 భారీ సిక్సర్లు, ఏడు బుల్లెట్ల వంటి ఫోర్లతో 135 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్నది 54 బంతులు మాత్రమే.
అతని బ్యాటింగ్ స్టైల్.. లెజెండరీ బ్యాటర్ యువరాజ్ సింగ్‌ను గుర్తుకు తెచ్చింది. అతని తరహాలోనే లెఫ్ట్ హ్యాండర్ అభిషేక్ శర్మ. అతని స్టాన్స్, షాట్ సెలెక్షన్, ఫుట్ వర్క్ మొత్తం యూవీని మరిపించేలా సాగింది. ఇదివరకు అభిషేక్ శర్మకు మెంటార్‌గా వ్యవహరించాడు యువరాజ్. దాన్ని అందిపుచ్చుకున్నాడు అభిషేక్.
గురువులాగే ఇంగ్లాండ్‌పై ఫాస్టెస్ట్ 50 చేసిన బ్యాటర్‌గా పేరు లిఖించుకున్నాడు. గతంలో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు యువరాజ్ సింగ్. ఇప్పుడు ఆ వారసత్వాన్ని శిష్యుడు కొనసాగించాడు. అదే ఇంగ్లాండ్‌పై 17 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. ఇంగ్లాండ్‌పై ఫాస్టెస్ట్ 50 చేసిన రెండో టీమిండియా బ్యాటర్ అభిషేక్ మాత్రమే.












Click it and Unblock the Notifications