టీమిండియా వైట్ వాష్- ఘోర అవమానం: సొంతగడ్డపై తొలిసారి సున్నా

IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. అత్యంత అవమానకరంగా ఈ మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 147 పరుగుల స్వల్ప పరుగులను కూడా ఛేదించడంలో చేతులెత్తేసింది. 25 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింద.

ముంబై వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న ఈ చివరి టెస్ట్‌లో నెగ్గితే గానీ వైట్ వాష్ నుంచి తప్పించుకోలేని దుస్థితిలో పడ్డ టీమిండియా ఏ మాత్రం కూడా పోరాటపటిమన కనపర్చలేకపోయింది. క్లీన్ స్వీప్ బారిన పడకుండా ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇలాంటి గేమ్‌లో బ్యాటర్లు చేతులెత్తేశారు. న్యూజిలాండ్ బౌలర్ల ప్రతాపానికి దాసోహం అయ్యారు.

IND vs NZ First time India have been whitewashed 3-0 clean sweep at home

ఈ ఉదయం నుంచి వికెట్లు ఒకదాని వెంట ఒకటి వరుస కట్టాయి. ఎక్కడే గానీ భారీ భాగస్వామ్యం నెలకొనలేదు. ఒక దశలో 29 పరుగులకే అయిదుమంది కొమ్ములు తిరిగిన బ్యాటర్లు అవుట్ అయ్యారు. ఆ సమయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, రిషభ్ పంత్ కొంత ప్రతిఘటించారు. బ్యాటింగ్ పతనాన్ని అడ్డుకోగలిగారు గానీ అది కొద్దిసేపే.

రోహిత్ శర్మ- 11, యశస్వి జైస్వాల్- 5, శుభ్‌మన్ గిల్- 1, విరాట్ కోహ్లీ- 1, సర్ఫరాజ్ ఖాన్- 1, రవీంద్ర జడేజా- 6, వాషింగ్టన్ సుందర్- 12, రవిచంద్రన్ అశ్విన్- 8, ఆకాష్ దీప్- 0, మహ్మద్ సిరాజ్- 0.. ఇవీ టీమిండియా స్కోర్ బోర్డ్‌పై కనిపించిన అంకెలు. మిడిలార్డర్‌లో ఒక్క వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రమే ఒంటరిపోరాటం సాగించాడు. 64 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్‌లో ముగ్గురు బౌలర్లు మాత్రమే భారత జట్టు పతనాన్ని శాసించారంటే వాళ్ల బౌలింగ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎజాజ్ పటేల్ ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్‌లోనూ అతనిదే ఆధిపత్యం. ఆ ఇన్నింగ్‌లో అయిదు వికెట్లు నేలకూల్చాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 11 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గ్లెన్ ఫిలిప్స్- 3, మాట్ హెన్రీ ఒక వికెట్ తీసుకున్నారు.

1999- 2000 తరువాత సొంత గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్‌కు గురి కావడం ఇదే తొలిసారి. అప్పట్లో దక్షిణాఫ్రికా చేతిలో 2-0 తేడాతో సిరీస్‌ను ఓడిపోయింది. 3-0 తేడాతో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోవడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇంతకుముందెప్పుడూ కూడా 3-0 తేడాతో స్వదేశంలో టెస్టుల్లో ఓడిపోలేదు. అది ఇప్పుడు సాధ్యపడింది.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం కావడం హేటర్స్‌కు పెట్టింది. రిటైర్మెంట్ ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. సోషల్ మీడియాలో వారిద్దరికీ వ్యతిరేకంగా వేలసంఖ్యలో ట్వీట్లు పడుతున్నాయి. దీని దెబ్బకు Retire అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ టెస్ట్ సిరీస్‌లో వీరిద్దరూ విఫలం కావడం జట్టు పరాజయాలకు కారణమైందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+