Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ind vs NZ: ఫైనల్ వేళ టీమిండియాకు భారీ గుడ్ న్యూస్, 2024 రిపీట్..!!

T20 World Cup final India Vs New Zealand: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ వేళ క్రికెట్ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అనూహ్య పరిస్థితుల్లో ఒక్కో విజయం సాధిస్తూ టీమిండియా ఫైనల్స్ కు చేరింది. ఫైనల్స్ లోనూ విజయం సాధించి ఛాంపియన్ గా నిలుస్తుందని అభిమానుల అంచనా. ఇదే సమయంలో ప్రత్యర్థి కివీస్ సైతం అన్ని రంగాల్లో బలంగా ఉంది. మంచి బ్యాటింగ్ లైనప్ కివీస్ కు కలిసి వచ్చే అంశం. అయితే, ఫైనల్ కు ముందే టీమిండియాకు శుభ సంకేతాలు అందుతున్నాయి. 2024 ఫలితం రిపీట్ అవుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లో కివీస్ తో టీమిండియా తల పడనుంది. అహ్మదాబాద్ కేంద్రంగా జరిగే ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు తుది వ్యూహాల్లో నిమగ్నయ్యాయి. పిచ్.. వాతావరణం తో పాటుగా టాస్ ఇక్కడ ఫలితంలో కీలక పాత్ర పోషించనుంది. టీమిండియా తుది జట్టులో మార్పు ల గురించి చర్చ జరుగుతోంది. అయితే, సెమీస్ టీంనే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెమీస్ లో సౌతాఫ్రికాతో కివీస్ బ్యాటర్ల వీర విహారం చూసిన తరువాత ఇందుకు అనుగుణంగా టీమిండియా ప్లాన్లు సిద్దం చేస్తోంది. ఇక.. ఇదే సమయంలో టీమిండియాకు మరో శుభ సంకేతం అందింది. ఈ చారిత్రాత్మక ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్ల జాబితాను ఐసీసీ (ICC) ప్రకటించింది. ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు అంపైర్‌గా ఎంపికయ్యారు. గతంలో 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లోనూ (భారత్ vs సౌతాఫ్రికా) ఆయనే అంపైర్‌గా ఉన్నారు. ఆ మ్యాచ్ లో గెలిచిన భారత్ ఛాంపియన్ గా నిలిచింది.

ind-vs-nz-the-icc-announces-the-match-officials-for-the-t20-world-cup-2026-final-as-india-take-on

అహ్మదాబాద్ వేదికగా భారీ ప్లాన్స్ తో ీ టీమిండియా

ఈ టోర్నీలో కొందరి అవుట్ నిర్ణయాల పైన చర్చ జరిగింది. దీంతో, ఫైనల్ కు ఐసీసీ ఏరి కోరి అంపైర్ల ను ఎంపిక చేసింది. రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌కు భారీ మ్యాచ్‌లను పర్యవేక్షించిన అనుభవం ఉంది. ఆయన 2023 వన్డే వరల్డ్ కప్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లోనూ అంపై రింగ్ చేశారు. మరోవైపు అలెక్స్ వార్ఫ్‌కు ఇది మొదటి సీనియర్ వరల్డ్ కప్ ఫైనల్. వీరిద్దరూ ఈ టోర్నీలో కోల్‌కతా వేదికగా జరిగిన న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా సెమీఫైనల్‌లోనూ అంపైర్లుగా వ్యవహరించారు. ఈ టైటిల్ పోరులో సౌతాఫ్రికాకు చెందిన అల్లావుద్దీన్ పాలేకర్ థర్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక ఫోర్త్ అంపైర్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన అడ్రియన్ హోల్డ్‌స్టాక్ వ్యవహరించనున్నారు. ఈ మెగా ఫైనల్‌కు మ్యాచ్ రెఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ బాధ్యతలు చేపట్టను న్నారు. ఈ ఫైనల్ లో గెలిస్తే వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. మరోవైపు న్యూజిలాండ్ రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. 2021లో ఫైనల్ చేరినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. దీంతో.. భారీగా ఫ్యాన్స్ మద్దతు టీమిండియాకు అహ్మదాబాద్ స్టేడియంలో లభించనుంది. ఇక.. 2024 ఫలితం ఫైనల్ లో రిపీట్ కావటం ఖాయమంటూ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+