దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టీ20: ప్లేయింగ్ 11, మ్యాచ్ టైమింగ్స్, ఛానల్ డీటెయిల్స్ ఇవే..
IND vs SA 2023: ఐసీసీ వరల్డ్ కప్ 2023, ఆస్ట్రేలియాతో అయిదు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్ తరువాత మరో సమరానికి భారత్ తయారయింది. తన నెక్స్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికాలో ఆ దేశ జట్టుతో తలపడబోతోంది. ఆదివారం డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగనుంది.
సుదీర్ఘంగా సాగే సిరీస్ ఇది. 2024 జనవరి 7వ తేదీ వరకు టీమిండియా దక్షిణాఫ్రికాలోనే ఉంటుంది. మూడు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్స్, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది భారత జట్టుకు. దీనికోసం ఇదివరకే జట్టు మొత్తం దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లింది.

భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. ఈ మ్యాచ్‌ను లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. 12, 14 తేదీల్లో జరిగే మ్యాచ్‌తో టీ20 సిరీస్ ముగుస్తుంది. 17, 19, 21 తేదీల్లో వన్డేలు షెడ్యూల్ అయ్యాయి. ఆ తరువాత టెస్ట్ సిరీస్ షురూ అవుతుంది. 26వ తేదీన తొలి టెస్ట్ జరుగుతుంది. జనవరి 3వ తేదీన రెండో టెస్ట్ ఉంటుంది.
ఈ సిరీస్ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ఇదివరకేే ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20, వన్డే ఇంటర్నేషనల్స్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరం అయ్యారు. వారిద్దరూ ఇందులో ఆడట్లేదు. టెస్ట్ సిరీస్ ప్రారంభం అయ్యే సమయానికి వారు జట్టుకు అందుబాటులోకి వస్తారు. టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్ కేప్టెన్లుగా వ్యవహరిస్తారు.
తొలి టీ20లో శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ మధ్య పోటీ నెలకొన్నట్టే కనిపిస్తోంది. ఇద్దరూ టీ20 ఓపెనర్లే కావడంతో ఎవరిని తుదిజట్టులోకి తీసుకోవాలనే విషయంపై కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.
తొలి టీ20 మ్యాచ్‌లో- యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్/రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, కుల్‌దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్/ముఖేష్ కుమార్ ఆడే అవకాశం ఉంది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications