Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నింటికీ సమాధానం చెబుతా..- మౌనం వీడిన రోహిత్ శర్మ

Rohit Sharma: భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఇప్పటికే మూడు చొప్పున మ్యాచ్‌లతో కూడిన టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ ముగిసింది. టీ20 సిరీస్ సమం కాగా.. వన్డేలను భారత్ గెలుచుకుంది. ఇదే దూకుడును టెస్టుల్లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.

రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఇది. తొలి టెస్ట్ మంగళవారం ఆరంభం కానుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. గ్వాటెంగ్‌లో సెంచూరియన్ సూపర్ స్పోర్ట్స్ పార్క్ స్టేడియం దీనికి వేదికగా మారింది. ఈ సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలనే ఉద్దేశంలో భారత్, కనీసం ఇందులోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలనే పట్టుదలతో దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.

IND vs SA 1st Test: You will get the answer soon, says Rohit Sharma

ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ ఆడబోతోన్నాడు. టీ20, వన్డేలకు అతను అందుబాటులో లేడనే విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ కోసం జట్టులోకి వచ్చాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ తరువాత వారిద్దరూ ఫీల్డ్‌లోకి దిగడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశ్రాంతి కోసం టీ20, వన్డే ఇంటర్నేషనల్స్‌కు దూరం అయ్యారు. ఇప్పుడు జట్టుకు అందుబాటులోకి వచ్చారు.

సెంచూరియన్ పార్క్‌లో ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు రోహిత్ శర్మ. దక్షిణాఫ్రికాలో ఆ దేశ జట్టుతో ఆడటం పెద్ద సవాలేనని, యంగ్ క్రికెటర్లు దీన్ని అవలీలగా అధిగమించడం శుభపరిణామమని వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికాలో సాధారణంగా బౌన్సీ పిచ్‌లు ఉంటాయని, అలాంటి వాటిపైనే యంగ్ క్రికెటర్లు రాణించారని పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికాలో భారత్ టెస్ట్ సిరీస్‌ను ఎప్పుడూ గెలవలేదని, ఆ లోటును తీరుస్తామని అభయం ఇచ్చాడు. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఓటమి భారాన్ని టెస్ట్ సిరీస్ గెలుపుతో భర్తీ చేస్తామని అన్నాడు. ఈ టెస్ట్ సిరీస్ కోసం అన్ని రకాలుగా తాము సిద్ధం అయ్యామని, ఎలాంటి పొరపాట్లు ఉండబోవని హామీ ఇస్తున్నానని నవ్వుతూ చెప్పాడు.

IND vs SA 1st Test: You will get the answer soon, says Rohit Sharma

ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఓటమి కొంత బాధించిందని, దీని నుంచి వేగంగా కోలుకోగలిగానని, అభిమానులు ప్రోత్సాహం దీనికి సహాయపడిందని రోహిత్ అన్నాడు. ఒక బ్యాటర్‌గా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తోన్నానని, జట్టును గెలిపించడానికి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తానని అన్నాడు.

టీ20 వరల్డ్ కప్‌లో విజయం సాధించడానికి ఎలాంటి వ్యూహాలు వేస్తోన్నారంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు నవ్వుతూ దాటవేశాడు. తన నుంచి ఎలాంటి సమాధానాన్ని రాబట్టుకుంటోన్నారనే విషయం తనకు అర్థమైందని, అన్నింటికీ త్వరలోనే సమాధానం ఇస్తానని పేర్కొన్నాడు.

సుదీర్ఘకాలం తరువాత మహిళల జట్టు టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల రోహిత్ శర్మ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మహిళలు రాణించడం ఆనందంగా ఉందని, తాను ఆ మ్యాచ్ చూశానని పేర్కొన్నాడు. టెస్టుల్లో మహిళలు రాణించాలనే పట్టుదల వారిలో కనిపించిందని, మరిన్ని టెస్టులను ఆడాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+