పాకిస్తాన్‌ను ఓడించిన జట్టుతో టీమిండియాకు గండం
IND vs USA: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్.. నేడు యునైటెడ్ స్టేట్స్‌తో తలపడబోతోంది. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని జట్లు ఇవి. ఈ రెండు జట్లు కూడా రెండు చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. రెండింట్లోనూ గెలిచి నాలుగు చొప్పున పాయింట్లను తమ ఖాతాలో వేసుకున్నాయి. గ్రూప్- ఏలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.
భారత్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్, ఆ తరువాత పాకిస్తాన్‌ను ఓడించింది. యూఎస్ కూడా ఇదే తరహాలో ఘన విజయాలను అందుకుంది. తొలి గేమ్‌లో కెనడాను అనంతరం పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. ప్రస్తుతం గ్రూప్- ఏ లో భారత్‌తో సమవుజ్జీగా ఉండే టీమ్ ఏదైనా ఉందంటే అది యునైటెడ్ స్టేట్స్ ఒక్కటే. ఈ రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడించడం హైలైట్.

తమ మూడో మ్యాచ్‌లో భారత్- యూఎస్ తలపడనున్నాయి. గెలిచిన జట్టు అగ్రస్థానానికి చేరుకుంటుంది. అలాగే- సూపర్ 8లో చోటు దక్కించుకుంటుంది. ఆ అవకాశం ఎవరికి లభిస్తుందనేది ఈ రాత్రికి తేలిపోతుంది. రాత్రి 8 గంటలకు ఆరంభం అయ్యే ఈ మ్యాచ్‌కు న్యూయార్క్‌లోని నస్సౌ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక.
ఈ రెండింట్లో ఏ జట్టు కూడా ఇప్పటివరకు భారీ స్కోర్ చేయలేదు. బౌలర్లదే రాజ్యం అయింది. పాక్‌పై యూఎస్ చేసిన 158 అత్యధికం. టీ20 మ్యాచ్‌లల్లో సాధారణంగా బ్యాటర్లు విజృంభిస్తుంటారు. యూఎస్ పిచ్‌లు మాత్రం దీనికి పూర్తి భిన్నం. బౌలర్లు చెప్పిన మాట వింటోన్నాయి. బంతిని ఎలా స్వింగ్ చేస్తే అలా స్వింగ్ అవుతోంది. బ్యాటర్లు భారీ స్కోర్లను నమోదు చేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్ ఎలా ఉంటుంటుదనేది ఆసక్తి రేపుతోంది.
తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ , అర్ష్‌దీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది.
యూఎస్ తుదిజట్టులో- స్టీవెన్ టేలర్, మోనాంక్ పటేల్ (కేప్టెన్ వికెట్ కీపర్), ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్, కోరె అండర్సన్, హర్మీత్ సింగ్, జస్‌దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్‌కు చోటు దక్కొచ్చు.












Click it and Unblock the Notifications