భారత జట్టు నుంచి ఏకంగా అయిదుమంది అవుట్..

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడబోయే భారత జట్టుపై నెలకొన్న సందిగ్ధత వీడిపోయింది. కొద్దిసేపటి కిందటే బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇందులో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి.కేప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కేప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ జట్టులో పునరాగమనం లభించింది. అయ్యర్ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు సెలెక్టర్లు. అతని తుది ఎంపిక ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పైనే ఆధారపడి స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు.

అదే రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్‌లకు జట్టు నుంచి ఉద్వాసన తప్పలేదు. ఈ ముగ్గురికీ జట్టులో చోటు దక్కలేదు. శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వడంతో మిడిలార్డర్ బ్యాటింగ్ బలోపేతమైనట్టయింది. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో అతను గాయపడ్డ విషయం తెలిసిందే. క్యాచ్ పడ్డబోయి జారిపడ్డ అయ్యర్.. మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ఏకంగా ఐసీయూలో అడ్మిట్ అయ్యాడు. అత్యవసర చికిత్సను పొందాడు.

India Names NZ ODI Squad as Tilak Varma Gaikwad Jurel Are Dropped

ఇప్పుడు అతను కోలుకుంటోన్నాడు. దీంతో జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. అతని తుది ఎంపిక.. ఫైనల్ ఫిట్ నెస్ పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. గాయంతో బాధపడిన అతను కొన్ని నెలల పాటు రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో బరువు తగ్గాడు. మ్యాచ్ ఫిట్‌నెస్‌కు దూరంగా ఉన్నట్లు వార్తలున్నప్పటికీ, వన్డే సిరీస్‌కు ముందు జరిగే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లలో ఆడనున్నాడు. ఇది క్లియరెన్స్ పొందడానికి అతనికి సహాయపడుతుంది.

దక్షిణాఫ్రికా సిరీస్‌లో తిలక్ వర్మ ఒకే మ్యాచ్ ఆడినా బ్యాటింగ్‌కు రాలేదు. ధ్రువ్ జురెల్ మూడు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ నాలుగో స్థానంలో సెంచరీ చేసి ఆకట్టుకున్నా, ఈ ఫార్మాట్‌లో భారత్ అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకడైన అయ్యర్‌కు చోటివ్వాల్సి వచ్చింది. న్యూజిలాండ్ సిరీస్ జనవరి 11న వడోదరలో జరిగే తొలి వన్డేతో మొదలవుతుంది. తదుపరి రెండు మ్యాచ్‌లు జనవరి 14న రాజ్‌కోట్‌లో, జనవరి 18న ఇండోర్‌లో జరుగుతాయి.

జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి కొనసాగుతోంది. ఈ సిరీస్ అతనికి చోటు దక్కలేదు. ఫిట్‌గా లేని హార్దిక్ పాండ్యాకు కూడా ఈసారి మినహాయింపును ఇచ్చింది. క్వాడ్ గాయంతో కొన్ని నెలలు దూరమైన పాండ్యా, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో పోటీ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేయడానికి హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ సీఓఈ నుండి క్లియరెన్స్ లభించలేదని, రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని అతని పని భారాన్ని పర్యవేక్షిస్తున్నామని బీసీసీఐ పేర్కొంది.

న్యూజిలాండ్ వన్డేలకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కేప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కేప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్ దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+