Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup: యథావిధిగా భారత్-పాక్ మ్యాచ్ ? బంగ్లా ఎన్నికలతోనే లింక్.. !

మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ (T20 world cup) జాతకాన్ని తిరగరాయబోతున్నట్లు భావిస్తున్న భారత్-పాకిస్తాన్ గ్రూప్ దశ పోరుపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టంతా ఉంది. భారత్ తో మ్యాచ్ ఆడబోమని ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం దీనిపై వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అటు ఐసీసీకి కూడా ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. దీంతో ఐసీసీ కూడా తక్షణ చర్యలు ప్రకటించలేకపోతోంది.

భారత్-మ్యాచ్ కు బంగ్లా ఎన్నికల లింక్

ఇలాంటి సమయంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సిందేనని ఐసీసీ పట్టుదలగా కనిపిస్తోంది. ఇందుకోసం తాజాగా తెరవెనుక దౌత్యాన్ని కూడా నెరిపింది. కానీ అవేవీ ఫలించకపోవడంతో ఈ మెగా టోర్నీ బ్రాడ్ కాస్టర్ అయిన జియో హాట్ స్టార్ సాయంతో న్యాయపోరాటానికి తెరలేపేందుకు సిద్దమవుతోంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ నుంచి ఓ కీలక సంకేతం అందుతోంది. అదే బంగ్లాదేశ్ ఎన్నికలు. ఈ నెల 12న జరిగే ఈ ఎన్నికలకూ భారత్-పాక్ మ్యాచ్ కూ లింక్ ఉన్నట్లు తెలుస్తోంది.

India-Pakistan T20 World Cup Clash at Risk PCB likely took U-Turn after Bangladesh Election

ఎన్నికల తర్వాత పాకిస్తాన్ యూటర్న్..

ఈ నెల 12న బంగ్లాదేశ్ ఎన్నికలు ముగిసిన తర్వాత పాకిస్తాన్ తమ మైండ్ గేమ్ కు తెరదించి 15న భారత్ తో మ్యాచ్ ను యథావిధిగా ఆడేలా యూటర్న్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తమ బౌలర్ ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి బహిష్కరించిన తర్వాత భారత్ లో మ్యాచ్ ల్ని ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఐసీసీ ఆ జట్టును వరల్డ్ కప్ నుంచి తప్పించింది. ఈ నిర్ణయాన్ని ఐసీసీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాత్రమే వ్యతిరేకించాయి. ఆ తర్వాత బంగ్లాకు పాకిస్తాన్ సంఘీభావం ప్రకటించింది.

India-Pakistan T20 World Cup Clash at Risk PCB likely took U-Turn after Bangladesh Election

యథావిథిగా మ్యాచ్ ?

ఇందులో భాగంగా భారత్ తో జరిగే గ్రూప్ దశ మ్యాచ్ ను ఆడబోమని పాకిస్తాన్ ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆడకపోతే అందరికీ భారీ నష్టాలు తప్పవు. అందుకే ఏ బంగ్లాదేశ్ కు సంఘీభావంగా ఈ మ్యాచ్ బహిష్కరిస్తామని పాకిస్తాన్ బ్లాక్ మెయిలింగ్ కు దిగిందో..ఆ బంగ్లాదేశ్ లోనే ఎన్నికలు 12న పూర్తయిన తర్వాత పీసీబీ యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు భారత్-పాక్ మ్యాచ్ యథావిధిగా జరిగిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+