T20 ల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా..! తొలి జట్టుగా రికార్డు పుటల్లోకి..!
పొట్టి క్రికెట్ గా పేరున్న టీ20ల్లో ప్రస్తుతం అంతర్జాతీయ స్ధాయిలో ఆడుతున్న జట్లలో టీమిండియా అగ్రస్థానంలో ఉంటుంది. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన కంటే ఒక్క పాయింట్ అధికంగా ఉన్న ఇంగ్లండ్ నంబర్ వన్ స్ధానంలో ఉన్నా.. గతంలో చాలా కాలం పాటు నంబర్ వన్ ర్యాంక్ భారత్ సొంతం. టీ20ల్లో అప్రతిహత విజయాలతో టీమిండియా ఇప్పటివరకూ ఎన్నో రికార్డులు తన ఖాతాల్లో జమ చేసుకుంది. గతంలో ధోనీ హయాంతో ప్రారంభిస్తే... ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ వచ్చే వరకూ భారత్ ఖాతాల్లో రెండు వరల్డ్ కప్ లతో సహా పలు రికార్డులు జమ అయ్యాయి. అయితే వీటన్నింటినీ మించిన మరో రికార్డును తాజాగా భారత్ సాధించింది.
న్యూజీలాండ్ లో న్యూజీలాండ్ తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో భారత్ (India) వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి 2-0తో లీడ్ లో ఉంది. అయితే క్రైస్ట్ చర్చ్ లో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో తెలుగు కుర్రవాళ్లు తిలక్ వర్మ-నితీష్ కుమార్ రెడ్డి వీరోచిత ఆటతీరుతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్ లో విజయం సాధించిన భారత్.. అంతర్జాతీయ టీ20ల్లో 200వ గెలుపును నమోదు చేసుకుంది. ఇలా ఇప్పటివరకూ ఏ జట్టు కూడా 200 మ్యాచ్ ల్లో గెలిచింది లేదు. దీంతో భారత్ 200 విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇప్పటివరకూ మొత్తం 30 టీ20 మ్యాచ్ లు ఆడిన భారత్.. అందులో 200 విజయాలు అందుకుంది.

ఇప్పటివరకూ భారత పురుషుల టీ20 జట్టు ఆడిన 300 మ్యాచ్ ల్లో 200 మ్యాచ్ లు గెలిచి 83 మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. మిగిలినవి టై అయ్యాయి. మరో 10 మ్యాచ్ ల్లో ఫలితం తేలలేదు. భారత్ తర్వాత ఈ జాబితాలో పాకిస్తాన్ రెండో స్ధానంలో ఉంది. పాకిస్తాన్ ఇప్పటివరకూ 304 టీ20 మ్యాచ్ లు ఆడి 176 విజయాలు సాధించింది. భారత్, పాకిస్తాన్ మాత్రమే టీ20ల్లో 300 మ్యాచ్ లు ఆడిన రికార్డు కలిగి ఉన్నాయి. వీరిద్దరి తర్వాత భారత్, పాకిస్తాన్ కంటే తక్కువ మ్యాచ్ లు ఆడిన న్యూజీలాండ్ 135 మ్యాచ్ ల్లో, దక్షిణాఫ్రికా 129 మ్యాచ్ ల్లో, ఆస్ట్రేలియా 127 మ్యాచ్ ల్లో గెలిచాయి. దీంతో టీ20 ఫార్మాట్ లో భారత్, పాకిస్తాన్ ఆధిపత్యం ఏ స్ధాయిలో ఉందో అర్దమవుతోంది. ముఖ్యంగా భారత్ విజయాల పరంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం న్యూజీలాండ్ తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో మిగిలిన మూడు మ్యాచ్ లు కూడా గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో పాటు 200 విజయాల రికార్డును మరింత మెరుగుపర్చుకునే అవకాశం కూడా ఉంది.














Click it and Unblock the Notifications
