పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి విజయం: రెపిఛేజ్‌కు క్వాలిఫై

Paris Olympics 2024: బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్.. ఒలింపిక్స్ 2024 అంగరంగ వైభవంగా ఆరంభం అయ్యాయి. 16 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆగస్టు 11వ తేదీన ముగుస్తాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడోత్సవాలు చివరిసారిగా 2021లో ముగిశాయి. టోక్యో దీనికి ఆతిథ్యాన్ని ఇచ్చింది అప్పట్లో.

ఇప్పుడు పారిస్ దీనికి వేదిక అయింది. ఒలింపిక్స్‌కు ఫ్రాన్స్ ఆతిథ్యాన్ని ఇవ్వటం వందేళ్ల తరువాత ఇదే తొలిసారి. ఓపెనింగ్ సెలెబ్రేషన్స్ ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు నుంచే పారిస్ వర్షం కురిసింది. మధ్యాహ్నం తుంపర్లతో ఆరంభమైన వాన.. గేమ్స్ ఆరంభం అయ్యే సమయానికి జడివానగా మారింది. భారీ వర్షంలోనే పారిస్ సీన్ నదిలో ఓపెనింగ్ సెరెమని ర్యాలీ కొనసాగింది.

India s Star Rower Balraj Panwar finishes 4th in Paris Olympics 2024 in Men s Single Sculls Heats

ఈ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఐకన్ శరత్ కమల్ ఆచంట ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు వారిద్దరూ. మొత్తంగా భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

రోయింగ్ కేటగిరీలో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. ఈ విభాగంలో స్టార్ రోవర్ బాల్‌రాజ్ పన్వర్ నాలుగో స్థానంలో నిలిచాడు. తృటిలో పతకాన్ని కోల్పోయినప్పటికీ.. నిరాశ పడాల్సిన అవసరం రాలేదు. ఆయనకు మరో అవకాశం లభించింది.

మరో రౌండ్‌లో అడుగుపెట్టారు. రెపిఛేజ్‌కు అర్హత సాధించారు. పురుషుల స్కల్స్ హీట్స్ విభాగంలో బాల్‌రాజ్ పన్వర్.. 07:07.11 సెకెన్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. దీనితో ఆయన రెపిఛేజ్‌కు అర్హత సాధించారు. ఆదివారం మధ్యాహ్నం 1:05 నిమిషాలకు ఆరంభం అయ్యే రెపిఛేజ్‌లో పన్వర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+