‌నేడు పా‌క్‌తో భారత్ ఢీ.. దాయాదుల పోరులో ఓల్డ్ రికార్డ్స్ ప్రకారం ఎవరిది పైచేయి ?

ఛాంపియన్స్ ట్రోఫీలో.. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ నేడు జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్నాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించొచ్చు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పై ఎప్పటిలానే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే టోర్నీని గెలుపుతో ఆరంభించిన భారత్ ఫుల్ జోష్ లో ఉంటే.. మరోవైపు సొంతగడ్డపై ఆరంభ మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది పాకిస్తాన్. పైగా భారీ తేడాతో ఓడటం వల్ల రన్‌రేట్‌పై కూడా తీవ్ర ప్రభావం పడింది. దాంతో భారత్‌తో మ్యాచ్ ఆ జట్టుకు డూ ఆర్ డై లాంటిది. ఓడితే పాకిస్తాన్ కు సెమీస్ ఆశలు గల్లంతు కానున్నాయి.

ఇక భారత్, పాక్ మ్యాచ్ అంటేనే ఇరు జట్ల ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. మ్యాచ్‌లో గెలిచిన జట్టు సంబరాల్లో మునిగితే.. ఓడిన జట్టు మాత్రం దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కోక తప్పదు. ఈ పరిస్థితుల్లో కొంతకాలంగా పాక్‌పై ఆధిపత్యం చెలాయిస్తోన్న భారత్ ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా మారింది. ఈ సారి కూడా అదే జోరును కొనసాగించాలని సెమీస్ బెర్త్ కూడా కన్ ఫార్మ్ చేసుకోవాలని భావిస్తోంది.

interesting details about india vs pakisthan today match

ఓల్డ్ రికార్డ్స్..

ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పాక్‌పై భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. గత పద్నాలుగేళ్ల కాలంలో వన్డేలు, టీ20లు కలిపి భారత్, పాకిస్తాన్‌ మధ్య 13 మ్యాచ్‌లు జరిగితే భారత్‌ 11 గెలిచి 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమిపాలైంది. వరుసగా గత ఐదు వన్డేల్లో పాక్‌ను చిత్తు చేసింది టీమిండియా. అయితే వన్డేల్లో హెడ్ టూ హెడ్ రికార్డ్స్‌లో మాత్రం పాక్ ఆధిపత్యం ప్రదరిస్తోంది. ఇరు జట్లు 135 వన్డేల్లో తలపడితే భారత్ 57 సార్లు గెలుపొందగా.. పాక్ 73 మ్యాచ్‌ల్లో నెగ్గింది. చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్, పాకిస్తాన్ ఐదు సార్లు తలపడగా.. పాక్ మూడు సార్లు, భారత్ రెండు సార్లు విజయం సాధించాయి.

దుబాయ్ అడ్వాంటేజ్..

దుబాయ్ మైదానం పాక్‌కు మరో హోం గ్రౌండ్ వంటిది. ఈ వేదికపై భారత్-పాకిస్తాన్‌ జట్లు 28 వన్డే మ్యాచ్‌లలో తలపడగా.. పాకిస్తాన్‌ 19 మ్యాచ్‌లలో గెలిస్తే.. భారత్ కేవలం 9 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. దాంతో దుబాయ్‌ గ్రౌండ్‌లో పాకిస్థాన్ జట్టును తేలిగ్గా తీసుకోవద్దని క్రికెట్ పండితులు హెచ్చరిస్తున్నారు.

మార్పు లేకుండానే ..

అలానే గత మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. రెండు సెంచరీలతో గిల్‌ తన ఫామ్‌ లో ఉంటే.. రోహిత్‌ శర్మ శుభారంభం ఇస్తున్నాడు. రాహుల్‌ బంగ్లాతో ఆకట్టుకోవడం.. అయ్యర్‌, పాండ్యా, జడేజా లాంటి వారితో బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో షమీ అద్భుతంగా రాణిస్తుండడం మరో ప్లస్ అని చెప్పాలి.

కానీ పాకిస్తాన్‌ జట్టు పరిస్థితి మాత్రం తేడాగా కనిపిస్తోంది. న్యూజిలాండ్‌ చేతిలో తొలి పోరులో ఓటమి.. బాబర్‌ ఆజమ్‌ పైనే టీం భారం అంతా ఉండడం మైనస్ గా మారుతోంది. మరోవైపు ఫఖర్‌ గాయంతో దూరం కావడం కూడా పాక్ ను కలవరపెడుతోంది. చూడాలి మరి ఈ ఉత్కంఠ పోరులో ఎవరు నెగ్గుతారో అని.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+