కొత్త కేప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్..!!
Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ జట్టుకు కొత్త సారథి వచ్చాడు. ప్రస్తుత కేప్టెన్ నితీష్ రాణా స్థానంలో మరో శ్రేయాస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించింది కేకేఆర్ ఫ్రాంఛైజీ. కొద్ది సేపటి కిందటే కొత్త కేప్టెన్ పేరును ప్రకటించింది. నితీష్ రాణాను వైస్ కేప్టెన్‌గా అపాయింట్ చేసింది.
ఈ సీజన్ మొత్తానికీ శ్రేయాస్ అయ్యర్.. జట్టుకు నాయకత్వాన్ని వహిస్తాడని కేకేఆర్ తెలిపింది. ఈ ఏడాది శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ ఆడలేదు. బ్యాక్ పెయిన్ కారణంగా టోర్నమెంట్ మొత్తానికీ దూరం అయ్యాడు. ఆ సమయంలో నితీష్ రాణా జట్టుకు సారథ్యాన్ని వహించాడు.

నితీష్ రాణా కేప్టెన్సీలో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది కేకేఆర్. 14 మ్యాచ్‌లల్లో ఎనిమిదింట్లో ఓడిపోయింది. ఆరు విజయాలను సాధించి 12 పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైంది. వచ్చే ఏడాది జరిగే సీజన్ కోసం రెగ్యులర్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అందుబాటులోకి వచ్చాడు.
ప్రస్తుతం అయ్యర్ ఫామ్‌లో ఉన్నాడు. కిందటి నెల ముగిసిన ఐసీసీ వరల్డ్ కప్ 2023లో సత్తా చాటాడు. టోర్నమెంట్ మొత్తం మీద 530 పరుగులు చేశాడు. మూడు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. అదే ఫామ్‌ను ఐపీఎల్‌లో కొనసాగిస్తుంది కేకేఆర్ ఫ్రాంఛైజీ ఆశిస్తోంది.
Quick Update 👇#IPL2024 @VenkyMysore @ShreyasIyer15 @NitishRana_27 pic.twitter.com/JRBJ5aEHRO
— KolkataKnightRiders (@KKRiders) December 14, 2023
ప్రస్తుతం అతను జట్టుతో పాటు దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. ప్రొటీస్‌తో జరిగే అన్ని ఫార్మట్ల సిరీస్‌లల్లో అతను ఆడుతున్నాడు. మూడు చొప్పున టీ20 ఇంటర్నేషనల్స్, వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడటానికి భారత జట్టు.. దక్షిణాఫ్రికా వెళ్లిన విషయం తెలిసిందే. నేడు జొహాన్నెస్‌బర్గ్‌లో మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది.












Click it and Unblock the Notifications