IPL 2024 playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ పై హర్భజన్ జోస్యం-సన్ రైజర్స్ కు షాక్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) లీగ్ దశ ముగింపుకు చేరుకుంటోంది. దాదాపు ప్రతీ జట్టూ చివరి మ్యాచ్ ల కోసం సిద్ధమవుతున్నాయి. లీగ్ దశలో టాప్ 4లో నిలిచిన జట్లకు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించే అవకాశం ఉండటంతో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈసారి టోర్నీలో ప్లేఆఫ్స్ కోసం గట్టిపోటీ నెలకున్న నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ తాజాగా ప్లేఆఫ్ పై తన అంచనాలను చెప్పేశాడు.
ఈసారి ఐపీఎల్ 2024 ప్లేఆఫ్ రేసు హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు టాప్ 4లో అర్హత సాధించే అవకాశాలు లేవని హర్బజన్ సింగ్ జోస్యం చెప్పాడు. ఇక ప్లేఆఫ్ కు అర్హత సాధించే జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఉన్నాయని భజ్జీ చెప్పుకొచ్చాడు. కానీ సన్ రైజర్స్ మాత్రం నాకౌట్ కు చేరే అవకాశాల్లేవని హర్భజన్ తేల్చేశాడు.

ఇప్పటికే ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టు దాదాపుగా ప్లేఆఫ్ కు అర్హత సాధించినట్లే. అయితే మరో రెండు బెర్తుల కోసం గట్టి పోటీ నెలకొంది. మూడో స్ధానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్లేఆఫ్ అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. దీంతో నాలుగో స్ధానం ఎవరికి దక్కనుందనే చర్చ జరుగుతోంది. దీనికి పాయింట్ల పట్టికే సమాధానం చెబుతోంది.
ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో నాలుగో స్ధానంలో ఉన్న సన్ రైజర్స్ కు మరో రెండు మ్యాచ్ లు మిగిలున్నాయి. ఈ రెండూ గెలిస్తే 18 పాయింట్లతో ప్లేఆఫ్ కు అర్హత సాధిస్తుందని అంచనా. కానీ హర్భజన్ మాత్రం ఇందుకు భిన్నంగా 12 పాయింట్లతో కొనసాగుతూ ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలున్న బెంగళూరును ఎంచుకోవడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది.

మే 18న చెన్నై, బెంగళూరు మధ్య జరిగే నాకౌట్ పోరులో గెలిస్తే చెన్నై ప్లేఆఫ్ చేరుకోవడం ఖాయం. అలాగే సన్ రైజర్స్ తర్వాతి రెండు మ్యాచ్ లు హైదరాబాద్ లోనే ఆడుతుంది. ఇందులో సన్ రైజర్స్ ఓడి.. చెన్నైపై బెంగళూరు గెలిస్చే ప్లేఆఫ్ కు వెళ్తుందని భజ్జీ అంచనా వేస్తున్నాడు. దీనిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications