IPL 2024 Playoffs: వర్షం వల్ల ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్ లు ఆగినా, రద్దయినా లెక్క ఇలా ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ఇప్పటివరకూ 62 మ్యాచ్ లు జరిగితే వాటిలో అత్యధిక మ్యాచ్ లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయాయి. అయితే కొన్ని మ్యాచ్ లకు మాత్రం ఆకస్మిక వర్షం ఇబ్బందిగా మారింది. దీంతో ఆయా మ్యాచ్ లు తాత్కాలికంగా నిలిచిపోవడం, లేక రద్దు కావడం కూడా జరిగిపోయాయి. మరి ఇప్పుడు ప్లే ఆఫ్ దశలో ఇలా జరిగితే ఫలితాలను ఎలా తేల్చబోతున్నారు, పాయింట్ల కేటాయింపు ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..
ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో భాగంగా రేపు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగే తొలి క్వాలిఫయర్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పోటీ పడనుంది. అలాగే ఎల్లుండి ఇదే స్టేడియంలో జరిగే రెండో క్వాలిఫయర్ లో రాయలల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ ల తర్వాత ఎలిమినేటర్ ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ లలో ఏదైనా ఆకస్మిక వర్షం కారణంగా ఆగిపోవడమూ, రద్దు కావడమూ జరిగితే ఫలితం తేల్చేందుకు రూల్స్ ఇలా ఉన్నాయి.

ఐపీఎల్ రూల్ 13.7.3 ప్రకారం ఆట మధ్యలో నిలిచిపోయినా, రద్దు చేయాల్సి వచ్చినా దీన్ని ముగించడానికి అదనంగా 120 నిమిషాలు లేదా రెండు గంటల సమయం కేటాయిస్తారు. ఇది ఇప్పటివరకూ జరిగిన లీగ్ మ్యాచ్ లకు కేటాయించిన గంటకు మరో గంట అదనం అన్నమాట. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనా, మధ్యలో అంతరాయం ఏర్పడినా ముందుగా 60 నిమిషాల అదనపు సమయం వాడుకోవచ్చు. ఆ తర్వాత టైమ్ అవుట్లకు కేటాయించిన సమయం, ఇన్నింగ్స్ మార్పు కోసం ఇచ్చిన టైమ్ కూడా వాడుకోవచ్చు. తద్వారా ఫలితం తేల్చాల్సి ఉంటుంది.
ఇలా అదనపు సమయం వెసులుబాటు ద్వారా కూడా మ్యాచ్ ఫలితం తేలకపోతే అప్పుడు రిజర్వ్ డే ఉంటుంది. వాటిలో మ్యాచ్ కొనసాగిస్తారు. గతంలో ఐపీఎల్ పైనల్ మ్యాచ్ కు మాత్రమే ఇలా రిజర్వ్ డే ఉండేది. కానీ ఈ సీజన్ నుంచి ప్లే ఆఫ్స్ లో భాగంగా జరిగే నాలుగు మ్యాచ్ లకు కూడా రిజర్వు డేను ఇచ్చారు. దీంతో ఎలాగైనా ఫలితాలు తేల్చేలా చూస్తున్నారు.












Click it and Unblock the Notifications