IPL 2024: ఆక్షన్ వేళ.. కావ్యా మారన్ సంచలన నిర్ణయం

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో మూడు నెలల్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.

రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. నేడు రిటెన్షన్ (Retention) జరుగనుంది. మినీ వేలం పాట (IPL 2024 auction) ఏర్పాటైంది. రిటెన్షన్ ప్లేయర్ల లిస్ట్ ఇదివరకే వెలువడింది.

IPL 2024: SRH trade Shahbaz Ahamad and Mayank Dagar moves to RCB

రిటెన్షన్ వేళ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ప్లేయర్స్ స్వాపింగ్‌కు పూనుకుంది. యంగ్ అండ్ డైనమిక్ ప్లేయర్‌ను జట్టులోకి తీసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) నుంచి ఆ స్టార్ బౌలర్‌ను దిగుమతి చేసుకుంది. జట్టులో ఉన్న మరో ప్లేయర్‌ను ఆర్సీబీకి పంపించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఆర్సీబీ (RCB) బౌలర్ షాబాజ్ అహ్మద్ (Shahbaz Ahamad)ను ట్రేడింగ్ చేసింది ఎస్ఆర్‌హెచ్ (SRH). అతనికి బదులుగా మయాంక్ డాగర్ (Mayank Dagar)ను ఆర్సీబీకి పంపించింది. మరోసారి బ్యాటర్ల కంటే బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను బలోపేతం చేసుకోవడానికే ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంఛైజీ చీఫ్ కావ్యా మారన్ (Kavya Maran) ప్రాధాన్యత ఇచ్చినట్టయింది.

షాబాజ్ అహ్మద్.. 2020లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 39 మ్యాచ్‌లను ఆడాడు. 14 వికెట్లను పడగొట్టాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 3/7. 9.15 ఎకానమీతో అతని బౌలింగ్ కొనసాగుతోంది ఈ మెగా ఈవెంట్‌లో. జాతీయ జట్టు తరఫున మూడు వన్డేలు, రెండు ఇంటర్నేషనల్స్ ఆడాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+