Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

SRH vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. బుధవారం తన రెండో మ్యాచ్ ఆడబోతోంది. బలమైన ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కొనబోతోంది. సాయంత్రం 7:30 గంటలకు గేమ్ మొదలవుతుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక.

ఈ రెండు జట్లు కూడా తాము ఎదుర్కొన్న తొలి మ్యాచ్‌లల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది సన్‌రైజర్స్ టీమ్. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత.. నిర్ణీత 20 ఓవర్లల్లో 20 ఓవర్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగలిగింది.

IPL 2024 SRH vs MI TSRTC arranged special city buses in Hyderabad

ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. తన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని అందుకోలేకపోయింది ముంబై. 162 పరుగుల వద్దే దాని ప్రస్థానం ముగిసింది.

ఇప్పుడీ రెండు జట్లు కూడా ఉప్పల్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాయి. హైఓల్టేజ్ మ్యాచ్ కావడం వల్ల భారీ సంఖ్యలో క్రికెట్ ప్రేమికులు స్టేడియానికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే టికెట్లన్నీ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

కాగా- క్రికెట్ ప్రేమికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ స్టేడియం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేకంగా సిటీబస్సులను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ జోన్ అధికారులు విడుదల చేశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 11:30 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.

మెహదీపట్నం, ఘట్‌కేసర్, హయత్ నగర్, ఎన్జీఓ కాలనీ, ఇబ్రహీంపట్నం, ల్యాబ్ క్వార్టర్స్, కోఠీ, అఫ్జల్‌గంజ్, లక్డీకాపుల్, దిల్‌షుక్‌నగర్, జీడిమెట్ల, కేపీహెచ్‌బీ, మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, హకీంపేట్, ఈసీఐఎల్, బోయిన్‌పల్లి, చార్మినార్, చాంద్రాయన్‌గుట్ట, కొండాపూర్, బీహెచ్‌ఈఎల్, ఎల్బీనగర్‌ నుంచి ఉప్పల్ స్టేడియానికి సాయంత్రం 6 నుంచి రాత్రి 11:30 గంటల వరకు రాకపోకలు సాగిస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+