IPL 2024: ధోనీ కెప్టెన్సీ ఎందుకు వదిలేశాడంటే ? కారణం చెప్పిన క్రిస్ గేల్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ నిన్న అట్టహాసంగా ప్రారంభమైంది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీకి దూరంగా ఉన్నా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం తన అప్రతిహత జైత్రయాత్రను కొనసాగించింది. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో ఎప్పటిగాలే దూకుడుగా ఆడిన చెన్నై బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సత్తా చాటడమే కాకుండా ప్రత్యర్ధి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఓటమిని రుచి చూపించింది. తద్వారా ఈసారి ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ బోణీ కొట్టింది.
ఈ నేపథ్యంలో అసలు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని మహేంద్ర సింగ్ ధోనీ ఎందుకు వదులుకున్నాడనే ప్రశ్న అభిమానుల్ని తొలిచేస్తోంది. ఇప్పటికే ధోనీ తప్పుకోవడం వెనుక ఎవరి ఇష్టం వచ్చిన కారణాల్ని వారు ప్రచారం చేసుకుంటుండగా..తాజాగా ఈ టోర్నీలో స్టూడియో ప్యానలిస్టుగా వ్యవహరిస్తున్న వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అసలు కారణం వెల్లడించాడు. ఈసారి ఐపీఎల్ టోర్నీలో ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వెనుక అదే అసలు కారణం అన్నాడు.

ఈసారి ఐపీఎల్ టోర్నీలో చెన్నై వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్ని మ్యాచ్ లు ఆడబోవడం లేదని క్రిస్ గేల్ స్పష్టం చేశాడు. అందుకే కెప్టెన్సీకి కూడా దూరంగా ఉన్నట్లు గేల్ చెప్పుకొచ్చాడు. టోర్నీ మధ్యలో ధోనీ రెస్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని గేల్ వెల్లడించాడు. చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ వ్యూహాల్లో భాగంగా ధోనీ ఇలా రెస్ట్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే కెప్టెన్సీకి రుతురాజ్ కు అప్పగించినట్లు తెలిపాడు. అయినా ధోనీ రాణిస్తాడని, అతని విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలూ అక్కర్లేదని గేల్ పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications