IPL 2024: ఈసారి మోస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరో తెలుసా ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ ఫస్టాఫ్ ముగిసిపోయింది. సెకండాఫ్ కొనసాగుతోంది. ఇవాళ గుజరాత్, ఢిల్లీ జట్ల మధ్య 40వ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. మరో 30 మ్యాచ్ లు ముగిస్తే ప్లేఆఫ్ దశకు టోర్నీ చేరుుకుంటుంది. అయితే గత ఏడాది ఐపీఎల్ సమయంలో అమల్లోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఈసారి టోర్నీలోనూ ప్రభావం చూపుతోంది. ఐపీఎల్ 2024లో ఇంపాక్ట్ ప్లేయర్లు పలు మ్యాచ్ లను శాసిస్తున్నారు. సడన్ గా ఎంట్రీ ఇచ్చి మ్యాచ్ ల గమనాన్నే మార్చేస్తున్నారు. పలువురు ఇంపాక్ట్ ప్లేయర్లు ఇప్పటికే వివిధ మ్యాచ్ ల ఫలితాల్ని మార్చేశారు.
ఇలా ఇప్పటివరకూ ఐపీఎల్ 2024లో విశేషంగా రాణించిన పలువురు ఇంపాక్ట్ ప్లేయర్లపై ఇప్పుడు క్రికెట్ వర్గాలతో పాటు అభిమానుల్లో కూడా చర్చ జరుగుతోంది. అలాగే వీరిలో అత్యంత ఎక్కువ ప్రభావం చూపిన ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరనే దానిపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ లో విశేషంగా రాణించిన పలువురు ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం.

ఈసారి అత్యంత ప్రభావం చూపిన ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో ముందుగా బ్యాటర్లను చూస్తే.. జోస్ బట్లర్ (142 రన్స్), సాయిసుదర్శన్ ( 113 రన్స్), శివమ్ దూబే (80 రన్స్ ), అశుతోష్ శర్మ (62 రన్స్), సూర్యకుమార్ యాదవ్ (52 రన్స్) టాప్ 5లో ఉన్నారు. అలాగే బౌలర్లను తీసుకుంటే మతీష పతిరణ (5 వికెట్లు), వైభవ్ అరోరా (4 వికెట్లు), నాండ్రే బర్గర్ (3 వికెట్లు), మోహిత్ శర్మ (3 వికెట్లు), మాయాంక్ మర్కండే (2 వికెట్లు) టాప్ 5లో ఉన్నారు.
అలాగే ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన అభిషేక్ పోరెల్ అత్యధికంగా ఐదుసార్లు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. ఆ తర్వాత చెన్నైకు చెందిన శివమ్ దూబే, పంజాబ్ కు చెందిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్, గుజరాత్ కు చెందిన సాయి సుదర్శన్ మూడేసి సార్లు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చారు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ల వల్ల చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా 81 పరుగులు, 5 వికెట్లు సాధించింది. గుజరాత్ 128 పరుగులు, 3 వికెట్లు సాధించింది. రాజస్తాన్ 189 పరుగులు, 3 వికెట్లు తెచ్చుకుంది. ఆర్సీబీ కూడా 108 పరుగులు 2 వికెట్లు సాధించింది.












Click it and Unblock the Notifications