నో అయ్యర్.. నో బట్లర్: అసలు హీరో వేరే

Vijaykumar Vyshak: ఐపీఎల్ 2025 సీజన్ 18వ ఎడిషన్‌లో మరో హోరాహోరీ పోరు చూసే అవకాశం లభించింది. గుజరాత్ టైటాన్స్‌పై అలవోకగా గెలిచి తీరుతుందనుకున్న పంజాబ్ కింగ్స్.. చిట్టచివరి వరకు పోరాడాల్సొచ్చింది. ఓడిపోయినా టైటాన్స్ పోరాట పటిమ శభాష్ అనిపించుకుంది.

మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ సాధించంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ చిట్టచివరి వరకూ పోరాడింది. విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచింది. 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 232 పరుగులు చేయగలిగింది.

IPL 2025 PBKS vs GT Vijaykumar Vyshak shines under pressure

పంజాబ్ కింగ్స్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యార్.. శివాలెత్తి ఆడాడు. 42 బంతుల్లో తొమ్మిది భారీ సిక్సర్లు, అయిదు ఫోర్లతో 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య- 47, చివర్లో శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులు.. ఆ జట్టు స్కోర్‌ బోర్డ్‌ను పరుగులు పెట్టించాయి. 243 వరకు తీసుకెళ్లగలిగాయి.

చేయాల్సిన స్కోర్ కొండంత ఉన్నా లెక్క చేయలేదు గుజరాత్ టైటాన్స్. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 5.5 ఓవర్లల్లోనే 61 పరుగులు కొట్టారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఈ దూకుడును కొనసాగించారు. జోస్ బట్లర్- 33 బంతుల్లో 54, షెర్ఫానె రూథర్‌ఫర్డ్- 28 బంతుల్లో 46 పరుగులతో పంజాబ్ కింగ్స్‌ను బెంబేలెత్తించారు.

కీలక దశలో జోస్ బట్లర్ అవుట్ కావడం, ఆ తరువాత వచ్చిన బ్యాటర్లెవరూ కూడా దూకుడుగా ఆడుతున్న రూథర్‌ఫర్డ్‌కు సహకరించకపోవడం గుజరాత్ టైటాన్స్ పరాజయానికి కారణమైంది. చివరి ఓవర్ నాలుగో బంతికి రూథర్‌ఫర్డ్ మెరుపు ఇన్నింగ్‌కు తెరపడింది.

గుజరాత్ బ్యాటర్లు ఇంత ధాటిగా బ్యాటింగ్ చేస్తోన్నప్పటికీ.. వాళ్లకు మూకుతాడు వేయగలిగాడు పంజాబ్ కింగ్స్ బౌలర్ విజయ్ కుమార్ వైశాఖ్. తన మూడు ఓవర్ల కోటాలో 28 పరుగులు మాత్రమే ఇవ్వగలిగాడు. 14 ఓవర్ల తరువాత బంతిని అందుకున్నాడీ కర్ణాటక బౌలర్.

15, 17 ఓవర్లల్లో అతను ఇచ్చింది అయిదు చొప్పున పరుగులే. కీలకమైన 19వ ఓవర్‌లో 18 పరుగులు ఇచ్చుకున్నప్పటికీ- అప్పటికే మ్యాచ్ దాదాపుగా పంజాబ్ కింగ్స్ చెేతికి వచ్చినట్టయింది. ఈ మూడు ఓవర్లల్లో గుజరాత్ బ్యాటర్లు రెండు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే కొట్టగలిగారు.. అది కూడా అతని చివరి ఓవర్‌లో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+