IPL 2026: మళ్లీ అదే తప్పిదం.. పంజాబ్ కింగ్స్‌కు తప్పని పరాజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు మరో పరాజయం ఎదురైంది. సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం కావడం విశేషం.
టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో ఓటమెరుగని జట్టుగా దూకుడు కనబర్చిన పంజాబ్ కింగ్స్ అనూహ్యంగా చతికిలపడింది. ముఖ్యంగా చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగ్‌తో పంజాబ్ కింగ్స్ మూల్యం చెల్లించుకుంటుంది.
210 సరిపోలేదు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రియాన్ష్ ఆర్య(33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56), శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో రాణించారు.
కూపర్ కానోల్లీ(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. సూర్యన్ష్ షెద్గే(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారీ రెండేసి వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్ ఒక వికెట్ తీసాడు.

కెప్టెన్ ఇన్నింగ్స్..
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగులు చేసి గెలుపొందింది. అక్షర్ పటేల్(30 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), డేవిడ్ మిల్లర్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. మాదవ్ తివారి(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 18 నాటౌట్), అషుతోష్ శర్మ(10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24)విజయ లాంఛనం పూర్తి చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సిగ్, యశ్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీయగా.. బెన్ ద్వార్షాయిస్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ పడగొట్టారు.
కొంపముంచిన చెత్త ఫీల్డింగ్
211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆశించిన ఆరంభం దక్కలేదు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్ కూడా త్వరగానే వెనుదిరిగాడు. 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఘోర పరాజయం తప్పదా? అని అంతా అనుకున్నారు. కానీ అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీలతో ఢిల్లీని ఆదుకున్నారు.
ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. చివర్లో అషుతోష్ శర్మ, యువ ప్లేయర్ మాదవ్ తివారి దూకుడుగా ఆడి విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. అయితే పంజాబ్ కింగ్స్ మరోసారి అవే తప్పిదాలను పునరావృతం చేసి మూల్యం చెల్లించుకుంది. కీలకమైన క్యాచ్‌లను పంజాబ్ ఆటగాళ్లు వదిలేయగా.. బౌలర్లు ధారళంగా పరుగులిచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications