స్టార్ ప్లేయర్లను టీం నుంచి గెంటేసిన కావ్య పాప

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంఛైజీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గత సీజన్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయకపోయినా, తమ కోర్ టీమ్‌ను కాపాడుకోవడంలో మేనేజ్‌మెంట్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ముఖ్యంగా, కావ్య మారన్ మాస్టర్ స్కెచ్‌తో మినీ వేలానికి భారీ నిధులను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ రిటెన్షన్ ప్రక్రియలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ట్రేడింగ్. గత సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీసి, 11.23 అధిక ఎకానమీ రేటును నమోదు చేసిన షమీని సన్‌రైజర్స్ విడుదల చేసింది. అయితే, ఈ ఆటగాడిని లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ట్రేడ్ చేసుకుంది. ఈ నిర్ణయం ద్వారా సన్‌రైజర్స్ పర్స్‌లో అదనంగా రూ. 10 కోట్లు మిగిలాయి.

IPL 2026 Retention Sunrisers Hyderabad Keeps Core Team

టీమ్ కోర్ బ్యాటింగ్ బలం గురించి వచ్చిన పుకార్లకు సన్‌రైజర్స్ పుల్‌స్టాప్ పెట్టింది. స్టార్ ప్లేయర్‌లు హెన్రిచ్ క్లాసెన్ , ఇషాన్ కిషన్లను విడుదల చేస్తారనే వార్తలు వచ్చినా, వారిని రిటైన్ చేసుకుని, మిడిల్ ఆర్డర్‌కు బలాన్ని చేకూర్చింది.

ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మ , ట్రావిస్ హెడ్లు మరోసారి కీలక పాత్ర పోషించనున్నారు. గత సీజన్‌లో అభిషేక్ 14 మ్యాచ్‌ల్లో 193.39 స్ట్రైక్ రేట్‌తో 439 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 13 మ్యాచ్‌ల్లో 162.61 స్ట్రైక్ రేట్‌తో 374 రన్స్ చేసి అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు.

విడుదలైన ఆటగాళ్లు
సన్‌రైజర్స్ ప్రధానంగా అనుకున్న స్థాయిలో రాణించని స్పిన్నర్లు, యువ ప్లేయర్లపై వేటు వేసింది. ఆడమ్ జంపా, రాహుల్ చాహర్. వియాన్ ముల్డర్, అభినవ్ మనోహర్, అథర్వ టైడే, సచిన్ బేబీ, సిమర్‌జీత్ సింగ్ వంటి ప్లేయర్లను వదులుకుంది.

సన్‌రైజర్స్ రిటైన్ చేసుకున్న టీమ్
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్) నేతృత్వంలో సన్‌రైజర్స్ 2026 సీజన్ కోసం తమ కోర్ టీమ్‌ను సిద్ధం చేసుకుంది. పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్.నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, అనికేత్ వర్మ, ఆర్.స్మరన్, హర్ష్ దూబే, కమిందు మెండిస్, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్, జిషాన్ మలింగస్ వంటి ప్లేయర్లను రిటైన్ చేసుకుంది.

మిగిలిన నిధులు, మినీ వేలం వ్యూహం
మొత్తం 25.5 కోట్ల భారీ మొత్తం ఇప్పుడు సన్‌రైజర్స్ పర్స్‌లో మిగిలి ఉంది. డిసెంబర్‌లో జరగనున్న మినీ వేలంలో, షమీ ట్రేడింగ్ ద్వారా వచ్చిన నిధులను ఉపయోగించి, టీమ్ మళ్లీ ఒక అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్‌ను, లేదా బలమైన ఆల్‌రౌండర్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+